రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత

ఇప్పటివరకు 1,100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గూడూరు నారాయణరెడ్డి చెబుతున్నారు.

రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత

Gudur Narayan Reddy

Updated On : March 21, 2024 / 5:39 PM IST

Gudur Narayana Reddy: బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల విడుదలైన రజాకార్ సినిమాకు గూడూరు నారాయణరెడ్డి నిర్మాతగా వ్యహరించిన విషయం తెలిసిందే. దీంతో తనకు ఇప్పటివరకు 1,100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గూడూరు నారాయణరెడ్డి చెబుతున్నారు.

భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గూడూరు నారాయణ రెడ్డి కోరారు. దీంతో 1+1 CRPF జవాన్లతో గూడూరు నారాయణరెడ్డికి కేంద్ర సర్కారు భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇటీవల విడుదలైన రజాకార్ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచీ వివాదాల్లో చిక్కుకుంది.

లోక్‌సభ ఎన్నికల వేళ రజాకార్ సినిమా విడుదల కావడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ర‌జాకార్‌ సినిమాలో బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌, తదితరులు నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వ బాధ్యతలను యాట స‌త్య‌నారాయ‌ణ‌ వహించారు. మార్చి 15న ఈ సినిమా విడుదలైంది.

Read Also: నా మొబైల్ ఫోన్‌ను బలవంతంగా సీజ్ చేశారు: బీఆర్ఎస్ నేత క్రిశాంక్