Yamuna River : శాంతించిన యమునా నది.. 205.45 మీటర్లకు తగ్గిన నీటి మట్టం

ప్రభావిత జిల్లాలైన ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్-A, నార్త్, సెంట్రల్, సౌత్ ఈస్ట్‌లలోని ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం, మంగళవారం మూసివేసింది.

Yamuna River

Yamuna Water Level Reduced : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, ఉత్తరాఖండ్,  జార్ఖండ్ రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిన వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలకు యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. అయితే ప్రస్తుతం యమునా నది శాంతించింది. యమునా నీటి మట్టం ఉదయం 6 గంటలకు 205.45 మీటర్లకు చేరింది.

సాయంత్రానికి యమునా నది నీటి మట్టం 205.22 మీటర్లకు చేరే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం తెలిపింది. యమునా నది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లుగా ఉన్నది. వారం రోజులపాటు యమునా నది వరదలు దేశ రాజధాని ఢిల్లీని కుదిపేశాయి.

Delhi Rain : ఢిల్లీలో కుండపోత వర్షాలు.. 40 ఏళ్ల తరువాత ఒక్క రోజులో భారీ వర్షం

ఎగువ రాష్ట్రాల్లో వరదలతో చరిత్రలో తొలిసారి యమునా నదిలో నీటిమట్టం 208.75 మీటర్లకు చేరింది. ఆరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, దుకాణాలు, కాలనీల నుంచి వరద నీటి తొలగింపు కార్యక్రమం మొదలైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరద బాధితులకు రూ.10 వేల ఆర్ధిక సాయం ప్రకటించారు.

యమునా నది వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు కొనసాగనున్నాయి. ప్రభావిత జిల్లాలైన ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్-A, నార్త్, సెంట్రల్, సౌత్ ఈస్ట్‌లలోని ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం, మంగళవారం మూసివేసింది.