10 facts about Gehlot: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడని ప్రచారం జరుగుతున్న గెహ్లోత్ గురించి కీలక విషయాలు

1971లో తూర్ప్ బెంగాలీ శరణార్థుల సంక్షోభ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన శరణార్థులకు సేవలందిస్తున్న సమయంలో ఇందిరా కంటబడ్డారు. అశోక్ సమర్థత, నైపుణ్యతలను గుర్తించి ఎన్ఎస్‭యూఐలోకి తీసుకున్నారు. అనంతరం ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. 1977లో తొలిసారి రాజస్థాన్ శాసన సభ సభ్యత్వం, ఆ తర్వాత మంత్రి, 1998లో తొలిసారి ముఖ్యమంత్రి.. ఇలా చకచకా జరిగిపోయాయి.

10 facts about Gehlot: కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు ఎక్కువగా నెహ్రూ-గాంధీ కుటుంబం వద్దే ఉంటూ వచ్చాయి. తాజాగా గత 24 ఏళ్లుగా గాంధీ కుటుంబమే ఆ పదవిలో ఉంది. 1998 నుంచి సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా ఉన్నారు. వాస్తవానికి ఆమె 2017లో పార్టీ పగ్గాలు కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. అయితే ఆయన ఏడాదిన్నరకే రాజీనామా చేయడంతో అప్పటి నుంచి మళ్లీ సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతూ వస్తున్నారు. ఎట్టకేలకు పార్టీకి శాశ్వత ప్రాతిపదికన నూతన అధ్యక్షుడి నియామకం కావాలని నిర్ణయించిన పార్టీ.. వచ్చే నెల 20లోపు ఆ పని ముగించనున్నట్లు ప్రకటించింది.

అయితే మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేరు. ఇక ప్రియాంక గాంధీ ఆ పదవికి ఏమాత్రం సుముఖత చూపడం లేదు. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత గాంధీయేతరులు అధ్యక్ష పీఠంపై కూర్చోనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు.. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడైన రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కాబోయే అధ్యక్షుడని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై ఆయనను ప్రశ్నించగా.. తనకు సోనియా గాంధీ ఏమీ చెప్పలేదని, మీడియాలోనే ఈ వార్తలు వింటున్నట్లు సమాధానం ఇచ్చారు.

Bilkis Bano case: బిల్కిస్ బానో నిందితుల విడుదల తప్పిదం: సొంత పార్టీపై బీజేపీ సీనియర్ నేత విమర్శలు

అధికారిక ప్రకటన ఏదీ జరగనప్పటికీ.. సోనియా సహా గాంధీ కుటుంబం అంతా గెహ్లోత్ వైపే మొగ్గు చూపారని, వాస్తవానికి ఆయనను ఫైనల్ చేసినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే దీనికంతటికీ కారణం.. గాంధీ కుటుంబానికి ఆయన వీరవిధేయతేనని వేరే చెప్పక్కర్లేదు. వందేళ్లు దాటి, దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అంటే ఆషామాషీ కాదు. ఆ స్థానానికి చేరువలో ఉన్నారని ప్రచారం జరుగుతోన్న అశోక్ గెహ్లోత్ గురించి కొన్ని కీలక విషయాలు.. మీకోసం..

1. ఇందిరా గాంధీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా వరకు, కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి సామాన్య కార్యకర్తల వరకు అందరినీ కలుపుకునిపోయే చాకచక్యం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సొంతం. ఆయన కాంగ్రెస్‌లోని కెప్టెన్ అమరీందర్ సింగ్, కమల్‌నాథ్‌ వంటివారిలా కాకుండా అధిష్ఠానానికి విధేయంగా ఉంటూనే తన పంతాన్ని నెగ్గించుకోగల సమర్థులు.

Congress: కాంగ్రెస్‭కు మరో కీలక నేత పార్టీకి గుడ్ బై.. వరుస రాజీనామాలో కుదేలవుతోన్న పార్టీ

2. 1951 మే 3న ఓ సామాన్య కుటుంబంలో గెహ్లోత్ జన్మించారు. లక్ష్మణ్ సింగ్ గెహ్లాట్, వృత్తి రీత్యా మెజీషియన్. తండ్రి బాటలోనే ఆయన కూడా మొదట మెజీషియన్ చేసేవారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆయన ఇంద్రజాల ప్రదర్శనలు చేసేవారు. అశోక్ సైన్స్, న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్. ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చేశారు. ఆయనకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

3. 1971లో తూర్ప్ బెంగాలీ శరణార్థుల సంక్షోభ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన శరణార్థులకు సేవలందిస్తున్న సమయంలో ఇందిరా కంటబడ్డారు. అశోక్ సమర్థత, నైపుణ్యతలను గుర్తించి ఎన్ఎస్‭యూఐలోకి తీసుకున్నారు. అనంతరం ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. 1977లో తొలిసారి రాజస్థాన్ శాసన సభ సభ్యత్వం, ఆ తర్వాత మంత్రి, 1998లో తొలిసారి ముఖ్యమంత్రి.. ఇలా చకచకా జరిగిపోయాయి.

4. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండడం గెహ్లోత్ ప్రత్యేకత. అన్ని వయసులవారితోనూ ఆత్మీయంగా మెలగడంలో దిట్ట. పార్టీ కార్యకర్తలు ఏ సమయంలోనైనా కలవడానికి, తమ సమస్యలను చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటారు.

PM Modi: షింజో అబేకు అధికారిక వీడ్కోలు.. వచ్చే నెల జపాన్ వెళ్లనున్న మోదీ

5. రాజస్తాన్‭లోని మాలి అనే వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన ఆయన.. కొద్ది కొద్దిగా ప్రజాదరణ సంపాదిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నప్పటికీ గాంధీ కుటుంబం పట్ల అత్యంత విశ్వాసంతో ఉండే వ్యక్తి. ఎంతటి విశ్వాసం అంటే.. ఒక సందర్భంలో ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడటానికే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారని, తన పదవిని కాపాడుకోవడానికి కాదని అన్నారు. గాంధీ కుటుంబానికి ఆయన వీర విధేయుడని చెప్పడానికి ఇంత కన్నా మరో ఉదాహరణ అక్కర్లేదు.

6. రాజకీయంగా గెహ్లోత్ సమర్ధుడు. కర్ణాటక, మధ్యప్రదేశ్.. ఇలా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలను బీజేపీ వరుసగా కూల్చుతూ పోతోంది. రాజస్తాన్ వరకు వచ్చే సరికి బీజేపీని పూర్తిగా నిలువరించగలిగారు. సొంత పార్టీ నుంచి లేచిన తిరుగుబాటును తన చాకచక్యంతో అణచివేశారు. అప్పటికే పలు రాష్ట్రాలు కోల్పోయి ఢీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి.. గెహ్లోత్ కొత్త ఊపిరి పోశారు.

7. రాజకీ ప్రత్యర్థులను మట్టుబెట్టడంతో గెహ్లోత్ అత్యంత సమర్థులు. అధిష్ఠానానికి విధేయంగా ఉంటూనే తనకు కావలసినదానిని సాధించుకోవడం ఆయనకు బాగా తెలుసు. అయితే సచిన్ పైలట్‌తో కాస్త రాజీపడక తప్పలేదు. తనకు ఏదైనా పనిని అప్పగించినపుడు అత్యంత నిజాయితీతో పూర్తి చేస్తారు. అదేవిధంగా తనను పక్కనబెట్టినపుడు ఎటువంటి వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తం చేయరు. అయితే తాను అనుకున్నదాన్ని సాధించడం కోసం ఓ వ్యూహం ప్రకారం పని చేయగలరు.

Rajasthan: రాజస్థాన్‌లో మరో దళిత విద్యార్థిపై టీచర్ దాడి.. స్పృహ తప్పిన విద్యార్థి

8. గెహ్లోత్ ఎంతటి చతురుడంటే వామపక్ష కార్యకర్తలతో కూడా సత్సంబంధాలు నెరపుతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పోరాడేటపుడు వారితో మాట్లాడి తన మాట వినేలా చేసుకుంటారు. అప్పుడప్పుడూ వారి ఎజెండాను అమలు చేస్తారు. ఇలాంటి లక్షణాలే ఆయనను గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రునిగా చేశాయి.

9. ఎవరికి ఏం కావాలో, ఎప్పుడు కావాలో ఆయనకు బాగా తెలుసు. సరిగ్గా ఆ సమయానికి దానిని ఇచ్చి సంతృప్తిపరచేందుకు కృషి చేస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన ఎంతో ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకున్నారు. అలా అని ఆయన ఓ సాధువుగా మారిపోలేదు. తన శత్రువుకు తన సింహాసనాన్ని అప్పగించేందు సిద్ధంగా లేరు.

10. ఇవన్నీ ఒకవైపైతే.. కేంద్ర మంత్రిగా పని చేసినా, ఐదుసార్లు ఎంపీగా గెలిచినా, రాజస్థాన్‌ను దాటి ఆయన నాయకుడిగా ఎదగలేదు. దీంతో గాంధీ కుటుంబాన్ని సవాల్ చేసే స్థాయి ఆయనకు లేదు. విశ్వాసుల ధైర్య సాహసాలు శత్రువులవైపు పని చేయాలని కానీ, ప్రభువులపై కాదు. ఇన్ని కారణాల మూలంగానే గెహ్లోత్‭ను కాంగ్రెస్ అధ్యక్షుడు చేయడానికి గాంధీ కుటుంబం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Congress YouTube channel: కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ డిలీట్

ట్రెండింగ్ వార్తలు