PM Modi: షింజో అబేకు అధికారిక వీడ్కోలు.. వచ్చే నెల జపాన్ వెళ్లనున్న మోదీ

వచ్చే నెలలో జపాన్‌లో జరగనున్న ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవ్వనున్నారు. సెప్టెంబర్ 27న ఈ కార్యక్రమం రాజధాని టోక్యోలో జరుగుతుంది.

PM Modi: షింజో అబేకు అధికారిక వీడ్కోలు.. వచ్చే నెల జపాన్ వెళ్లనున్న మోదీ

PM Modi: గత నెలలో హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు, ఆ దేశ ప్రభుత్వం అధికారిక వీడ్కోలు పలకనుంది. వచ్చే నెల 27న జపాన్ రాజధాని టోక్యోలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. తాజా సమాచారం ప్రకారం మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

Arvind Kejriwal: ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కేజ్రీవాల్.. ఎమ్మెల్యేలతో భేటీకి పిలుపు

అనంతరం జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదాతో సమావేశమవుతారని స్థానిక మీడియా వెల్లడించింది. టోక్యోలోని కిటనోమారు నేషనల్ గార్డెన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత్‌కు అత్యంత మిత్ర దేశాల్లో జపాన్ ఒకటి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి ‘క్వాడ్’గా ఏర్పడింది. దీనిలో భాగంగా భారత్-జపాన్‌లు అనేక అంశాల్లో పరస్పర సహకారం అందించుకుంటున్నాయి. ఇక షింజో అబే.. మోదీకి అత్యంత సన్నిహితుడు. అనేకసార్లు ఇద్దరూ భేటీ అయ్యారు. చివరిగా గత మే నెలలో ఇద్దరూ కలుసుకున్నారు. 2018లో మోదీ, జపాన్ వెళ్లినప్పుడు అబే ప్రత్యేకంగా తన పూర్వీకుల నివాసానికి తీసుకెళ్లారు. షింజో అబే కాలంలో భారత్-జపాన్ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి.

Nitish Kumar: విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్.. బీజేపీపై విమర్శలు

జపాన్ ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా షింజో అబే చరిత్ర సృష్టించారు. అయితే, గత నెలలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు అక్కడి ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో అధికారికంగా నిర్వహించనున్న రెండో వీడ్కోలు కార్యక్రమం ఇదే.