లాక్ డౌన్ ఉల్లంఘించిన యువకులు…కరోనా పేషెంట్ పక్కన కూర్చోబెట్టిన పోలీసులు

లాక్ డౌన్ ఉల్లంఘించవద్దు అంటూ ప్రభుత్వాలు,మీడియా సంస్థలు ఎంత మొత్తుకుని చెబుతున్నా అవేమీ పట్టికోకుండా రోడ్లపై జాలీగా తిరుగుతున్నారు కొందరు ఆకతాయిలు. మొఖానికి మాస్క్ లేకుండా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై బైక్ వేసుకుని సరదగా తిరుగుతున్న ముగ్గురు యువకులకు గుండెల్లో దడ పుట్టించేలా,అసలు లాక్ డౌన్ ఉన్నంతకాలం గడప దాటి అడుగు బయట పెట్టాలంటేనే భయపేలా శిక్ష విధించారు తమిళనాడు పోలీసులు.

అసలేం జరిగిందంటే…తమిళనాడులోని తిర్పూర్ సిటీలో ముగ్గురు యువకులు ఫేస్ మాస్క్ కూడా లేకుండా ఓ స్కూటీపై రోడ్లపై సరదాగా తిరుగున్నారు. అయితే ఓ జంక్షన్ దగ్గర పోలీసులు వీళ్ల స్కూటీని ఆపారు. రోడ్లపై ఎందుకొచ్చారు అని పోలీసులు ప్రశ్నించగా..ముగ్గురి సరదాగా బయటికొచ్చినట్లు చెప్పడంతో పోలీసులు వీళ్లకు సరైన శిక్ష విధించాలని డిసైడ్ అయ్యారు. వెంటనే ఆ ముగ్గురిని పక్కనే ఉన్న ఓ అంబులెన్స్ లోకి ఎక్కించేందుకు అంబులెన్స్ డోర్ తీయగా..అందులో కరోనా వైరస్ పేషెంట్ గెటప్ లో ఓ యువకుడు ఫుల్ ప్రొటెక్షివ్ గేర్ తో ఉన్నాడు.

నానా కష్టం మీద పోలీసులు ఆ ముగ్గురిని అంబులెన్స్ లో ఎక్కించారు. అయితే అంబులెన్స్ లో కూర్చొని ఉన్న వ్యక్తి కరోనా పేషెంట్ అని భావంచి హడలిపోయారు ఆ ముగ్గురుని అంబులెన్స్ లో పేషెంట్ గెటప్ లో ఉన్న వ్యక్తి పక్కన కూర్చోబెట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఆ ముగ్గురికి గుండెళ్లో టెన్షన్ పుట్టుకొచ్చింది. సార్ ప్లీజ్..దయచేసి వదిలేయండి…ఇంకెప్పుడూ రోడ్లమీదకు రాము సార్ అంటూ హాహాకారాలు చేశారు. చివరకు అంబులెన్స్  అద్దాలు కూడా పగులకొట్టి బయటికొచ్చేందుకు ఆ ముగ్గురు ప్రయత్నించారు.

అంబులెన్స్ లో వ్యక్తి దగ్గరికొస్తుంటే..ప్లీజ్ రావద్దు..దండం పెడతా…ప్లీజ్ అంటూ బతిమిలాడారు ఆ ముగ్గురు. చివరకు పోలీసులు ఆ ముగ్గురిని అంబులెన్స్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే అంబులెన్స్ లో ఉన్న వ్యక్తి నిజమైన కరోనా పేషెంట్ కాదని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ నియమాలకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని పోలీసులకు వాగ్దానం చేసిన యువకులకు ఈ ఉపాయం సరిపోతుందని నిరూపించబడింది.