CEO of a theatre company Greg Ross
CEO of a theatre company Greg Ross : 60 వయస్సు వచ్చిందంటే పని చేసి చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు చాలామంది. కానీ ఆస్ట్రేలియా(Australia)కు చెందిన సినిమా హాళ్ల సంస్థ సీఈవో (CEO of a theatre company) గ్రెగ్ రాస్ (Greg Ross)మాత్రం తను ఎంత డబ్బు సంపాదించినా..సీఈవో స్థాయిలో ఉన్నా అతనికి ఏదో అసంతృప్తి వెన్నంటేది. కానీ అనుకున్నది చేయాలనే తపనను మాత్రం అతను వదల్లేదు. అలా 60 ఏళ్ల వయస్సులో ట్రక్ డ్రైవర్ గా మారారు గ్రెగ్. సీఈవో ఉద్యోగానికి రాజీనామా చేసి 60 ఏళ్ల వయస్సులో ట్రక్ డ్రైవర్ గా మారాడు.
క్యాన్సర్ బారిన పడి దాన్ని అధిగమించి ట్రక్ డ్రైవర్ గా జీవన సాగిస్తున్నారు. 60 ఏళ్ల వయస్సులో ట్రక్ డ్రైవర్ గా మారి 17 ఏళ్లుగా అదే పనిచేస్తున్నారు. ఈ ట్రక్ డ్రైవర్ వర్క్ తనలో ఉన్న అసంతృప్తిని తీసివేసిందంటున్నారు. అంటే ఇన్నాళ్లుగా అదే అతని అసంతప్తికి కారణమని గ్రహించారు. ఇప్పుడు గ్రెగ్ వయస్సు 72 ఏళ్లు. అయినా ఎంతో ఉత్సాహంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
గ్రెగ్ రాస్ ఓ కార్ల సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవారు. ఆ సమయంలో జీవితంలో ఏదో కోల్పోయాననే అసంతృప్తిలోనే ఉండేవారు. పిల్లలు చిన్నవాళ్లు కావటంతో కుటుంబ బాధ్యతల వల్ల అలాగే ఉద్యోగంలో కొనసాగారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉద్యోగంలో కొనసాగినా ఎప్పటికైనా తనలో ఉన్న అసంతృప్తిని జయించాలనుకునేవారు. కాలక్రమంలో ఆయన ఓ సినిమా హాళ్ల సంస్థకు సీఈవోగా ఎదిగారు. మంచి జీతం, హోదా, సకల సౌకర్యాలు..చేతినిండా డబ్బు. అయినా ఆయనలో అసంతృప్తి మాత్రం ఇంకా అలాగే ఉంది. ఏదో వెలితితో నిత్యం ఏదో కోల్పోయననే భావనలోనే ఉండేవారు.
అటువంటి ఆలోచనలతో ఓ రోజున తెగించి ఉద్యోగానికి రాజీనామా చేసేవారు. ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలనే ఆలయనతో 60 ఏళ్ల వయస్సులో ఉద్యోగాన్ని వదిలేశారు. ఓ రవాణా కంపెనీలో ట్రక్కు డ్రైవర్ పోస్టు కోసం అప్లై చేసుకోగా ఆ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరాక తోటి కొలీగ్స్ తో పాటు అక్కడున్నవారంతా గ్రెగ్ రాస్ గతం తెలిసి ఆశ్చర్యపోయారు. కానీ ఆ కొత్త ఉద్యోగంలో గ్రెగ్ కు ఉత్సాహం కనిపించేది. ప్రస్తుతం గ్రెగ్ కు 72 ఏళ్లు.
20 ఏళ్ల క్రితం రాస్ థైరాయిడ్ క్యాన్సర్ (thyroid cancer)బారిన పడి చికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో డాక్టర్లు మూడు నెలలు కంటే ఎక్కువ కాలం బతికే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు. కానీ గ్రెస్ కు బహుశా ఇష్టమైన పని చేయటం వల్ల కావచ్చు విల్ పవర్ పెరిగి వ్యక్తి క్యాన్సర్‌ను జయించి..ట్రక్ డ్రైవర్ గా జీవితం సాగిస్తున్నారు. కానీ మహమ్మారి క్యాన్సర్ ను జయించటం..సీఈవో స్థాయి ఉద్యోగం వదులుకుని ట్రక్ డ్రైవర్ గా కొనసాగటం అంటే మాటలు కాదు..
Salt Treatment : ఉప్పులో పాతేస్తే ఒత్తిడి పోతుందట .. సాల్ట్ ట్రీట్‌మెంట్‌తో సాటిలేని ప్రయోజనాలు
అన్నట్లుగా గ్రెగ్ నడిపే ఆ ట్రక్కు అలాంటిలాంటిది కాదు. దీన్నిరోడ్ ట్రైన్ అనటం సరైందేమో. ఈ ట్రక్కు 190 అడుగుల పొడుగు, 480 టన్నులు బరువు, రెండు ఇంజన్లు, ఐదు ట్రైలర్లు ఉంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కును నడపాలని గ్రెగ్ కల. అలా తన కలను నెరవేర్చుకుంటు తన చేసే పనిని ఆస్వాదిస్తున్నాడు. కానీ ఇష్టమైన పని కోసం సీఈవో స్థాయిని వదులుకోవటం అందరికి సాధ్యం కాదని చెప్పాల్సిందే.