Strange Marriage : తండ్రికి నాలుగో పెళ్లి .. కన్నకూతురే ఆ నాలుగో భార్య.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఈ ప్రపంచ వ్యాప్తంగా వివాహాలు చేసుకునే విధానంలో ఎన్నో వింత వింత సంప్రదాయాలుంటాయి. కానీ తండ్రీ కూతుళ్లు వివాహం చేసుకుంటారని బహుశా విని ఉండం. కానీ ఓ తండ్రికి కన్నకూతురే నాలుగో భార్య అయ్యింది. నవ్వుతు కన్నతండ్రిని వివాహం చేసుకున్న కూతురు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వివాహానికి ఆమె చెప్పిన కారణం వింటే నోరెళ్లబెట్టాల్సిందే..

Pakistan Girs married to a father
Pak Girs married to a father : పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి నాలుగో వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్ అంటే ఇస్లామిక్ దేశం. ముస్లింలులు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవటం పెద్ద విషయం కాదు. ఒక్కోసారి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవారుకూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇది కూడా పెద్ద విషయంకాదు అక్కడ. కానీ ఆ నాలుగో భార్య అతని కన్నకూతురే కావటం విశేషంగా మారింది. కన్నకూతురునే వివాహం చేసుకున్నాడా వ్యక్తి. కూతురిని బెదిరించి మాత్రం చేసుకోలేదు. ఆమె ఇష్ట ప్రకారమే చేసుకున్నాడు. కన్నతండ్రికే నాలుగో భార్య అయ్యింది ఆ యువతి పైగా తన ఇష్టంతోనే..కన్నకూతురిని నాలుగో భార్యను చేసుకున్న ఈ వివాహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కూతురు పేరు రబియా. ఈ పేరే ఆమె కన్నతండ్రికి భార్య కావటానికికారణమైందట..
Girl inspiring Video : ఆడపిల్లలకు చదువెందుకు? అన్న తండ్రికి కూతురి ధీటైన సమాధానం చూడండి
ఇంతకీ వీళ్లు ఎందుకిలా చేశారు..? కారణం తెలిస్తే ఓరి నాయనో ఇటువంటి కారణంతో కూడా ఇటువంటి వింత వివాహాలు చేసుకుంటారా? అంటారు. ఇంతకీ ఆ కారణం ఏంటంటే..ఈ తండ్రీ కూతుళ్లు దంపతులుగా మారటానికి కారణం ‘కూతురి పేరు’ కారణమట..కన్నతండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఆమెను అడిగితే..ఆమె మాట్లాడుతు..రబియా (Rabiya). ఈ రబియా అనే పదం అరబిక్‌లోని అరబు నుంచి పుట్టింది. అరబిక్‌లో రబియా అంటే నాలుగు అని అర్థం. కొందరు ముస్లింలు నాలుగో సంతానంగా అమ్మాయి పుడితే రబియా అని పేరు పెట్టుకుంటారట. కానీ…ఈ అమ్మాయి మాత్రం తన తండ్రికి రెండో సంతానం. అయినా తండ్రి ఆ పేరు పెట్టాడు.
Woman’s offer for Husband : ఆమెకు అలాంటి భర్త కావాలట,వెతికిపెడితే రూ.4 లక్షలు ఇస్తుందట..మీదే లేటు
“నాకు తెలిసినంత వరకూ రబియా అనే పేరుతో ఉన్న వాళ్లంతా నాలుగో సంతానమే. కానీ నేను మాత్రం మా నాన్నకి రెండో కూతుర్ని. మరి నా పేరుకి జస్టిఫికేషన్ ఉండాలిగా. ఏం చేయాలా అని ఆలోచించాను. మా నాన్నకి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. నేనే మా నాన్నని పెళ్లి చేసుకుని నాలుగో భార్యగా ఉండాలనుకున్నాను. అలాగైనా నా పేరు (రబియా)కి న్యాయం చేసినట్టు అవుతుందని భావించానని చెబుతోంది. అందుకే మా తండ్రిని వివాహం చేసుకోవటానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాని చెబుతోంది. ఇదంతా తెలిసి ఇవేం ఆలోచనలు ఇదేం లాజిక్ రా బాబూ అంటున్నారు జనాలు.