Beer Bathing in Beach : బీచ్లో బీరుతో స్నానం, ట్రెండ్ ఫాలో అవుతున్న జనాలకు క్యాన్సర్ వార్నింగ్
బీరుతో స్నానం చేస్తే చర్మం మెరిసిపోతుంది.మీరు వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుందా..అందుకే బీరుతో బీచుల్లో కూర్చుని స్నానాలు చేస్తున్నారు? దీంట్లో నిజమెంత..? నిపుణులు ఏమని చెబుతున్నారు..?

Beer Bathing in Beach
Beer Bathing in Beach : ఎవరో ఏదో చేస్తాడు. అదో ట్రెండ్ అయి కూర్చుంటుంది. ఏది ఎందుకు వైరల్ అవుతుందో తెలీదు. కానీ ఎవరో ఏదో చేస్తారు..ఎందుకో ట్రెండ్ అవుతుంది. దాన్ని జనాలు ఫాలో అయిపోతుంటారు. ట్రెండ్ సెట్ చేసేవారు ఎవరో అయితే ఫాలో అయిపోతుంటారు. అలా రీసెంట్ గా ట్రెండ్ అవుతోంది ‘బీచ్ లో బీర్ తో బాతింగ్’..బీచ్ లో బీరుతో స్నానం..ఎవరో ఓ వ్యక్తి బీచ్ లో బీర్ తో స్నానం చేసి దాన్ని టిక్ టాక్ లో వైరల్ కావటంతో వావ్..ఇదేదో బాగుందే అంటు చాలామంది ఫాలో అయిపోతున్నారు.
బీచ్లో బట్టలిప్పి ఒంటి మీద బీర్ పోసుకుంటారు. ఎండలో పడుకుంటారు. ఇలా చేస్తే శరీరంపైన మలినాలు పోయి.. చర్మం కాంతివంతంగా మారుతుంది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటంతో చాలామంది అదే పాటిస్తున్నారు. కానీ అలా చేయటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీరుతో స్నానం చేస్తే.. చర్మం మెరిసిపోతుందని ఎక్కడా ఆధారాలు లేవని పైగా ఇలా చేయటం వల్ల చర్మ క్యాన్యన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశముందిన హెచ్చరిస్తున్నారు.
Expensive Teapot : వామ్మో..ఒక్క ఈ టీ పాట్ ధర రూ.24 కోట్లు ..
బీరుతో స్నానం చేస్తే దాంట్లో ఉండే హాప్ అనే పదార్థం మెలనిన్ ను ప్రేరేపితం చేస్తుందని .. చర్మం మెరిసిపోతుందని చాలామంది నమ్ముతున్నారు. యూవీ కిరణాల నుంచి విడుదల అయ్యే రెడియేషన్ నుంచి కాపాడుతుందని నమ్ముతున్నారు. ఈ బీర్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయమంటూ పుకార్లు రావటంతో చాలామంది బీరు బాటిల్స్ పట్టుకుని బీచ్ ల్లో స్నానాలు చేస్తున్నారు.
కానీ ఇలా బీర్ తో స్నానం చేయటం వల్ల అంటే బీర్ శరీరంపై పోసుకుంటే చర్మ క్యాన్సర్(Cancer) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీరుతో స్నానం చేస్తే.. చర్మం కాంతివంతగా అవుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంచేస్తున్నారు.
Right To Sleep : మీ నిద్రకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై కేసు పెట్టొచ్చు అని తెలుసా..?