Kerala : రూ. కోటి లాటరీ గెలిచిన వ్యక్తికి పోలీస్ సెక్యురిటీ
రూ. కోటి లాటరీ గెలిచిన వ్యక్తికి పోలీసులు అండగా నిలబడ్డారు. లాటరీ గెలిచిన వ్యక్తి కోసం పోలీసులు ఏం చేశారంటే..

Rs. 1 cr lottery
Kerala migrant labourer Rs.1Crore Lottery : కేరళ (Kerala)లోని తిరువనంతపురం (ThiruvananthaPuram)లో ఓ వలస కార్మికుడి (migrant labourer)కి అదృష్టం వరించింది. కోటి రూపాయల లాటరీ (Rs.1Crore Lottery) తగిలింది. అది తెలిసి ఆనందపడాల్సిన ఆ కార్మికుడు పాపం తెగ భయపడిపోయాడు. ఓ పక్కన కోటి రూపాయలు లాటరీ తగిలిందనే ఆనందం..మరోపక్క భయం ఆందోళన పడిపోయాడు. ఏం చేయాలో తెలియక ఆనందం..ఆందోళన నిండిన మనస్సుతో స్థానికంగా ఉన్న తంపనూరు పోలీస్ స్టేషన్ (Thampamoor Police station)కు పరిగెత్తాడు.నన్ను కాపాడండీ సార్..నాపై ఎవరైనా దాడి చేస్తారేమోనని భయంగా ఉంది అంటూ తెగ కంగారుపడిపోయాడు…నాకు సెక్యురిటీ ఇవ్వండీ అంటూ కోరాడు. దీంతో తిరువంతపురం పోలీసులు (ThiruvananthaPuram police) అతడికి ధైర్యం చెప్పారు..కాస్త స్థిమితపడ్డాకు విషయం ఏంటీ ఎవరు నీపై దాడి చేస్తారు? ఎందుకు? అని అడిగారు.
దాంతో అతను తనకు కోటి రూపాయల లాటరీ తగిలిందని దాని కోసం ఎవరైనా ఆశపడి దాడి చేస్తారేమోనని భయంవేస్తోందని చెప్పాడు. పైగా లాటరీ అయితే గెలిచాను..కానీ ఆ డబ్బులు ఎలా తీసుకోవాలో నాకు తెలియదు మీరే నాకు సహాయం చేయాలి…అంటూ అమాయకంగా తన గోడు వెళ్లబోసుకున్నాడు. అది విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. అతను చెప్పేది నిజమో కాదో తెలుసుకోవటానికి అతని వద్ద ఉన్న లాటరీ టికెట్ తీసుకుని పరిశీలించారు. అది నిజమేనని తెలియటంతో ఇదేంటయ్యా ఆనందపడాల్సింది పోయి ఇలా ఆందోళన పడుతున్నావేంటీ..అంటూ ధైర్యం చెప్పారు.
Private Travels Bus : బస్సులో రీసౌండ్ మ్యూజిక్ పెట్టింనందుకు కండక్టరు, డ్రైవర్‌కు రూ.10,000 జరిమానా
పశ్చిమబెంగాల్ (West bengal)కు చెందిన బిర్షు రాంబ (Birshu Ramba)అనే కార్మికుడు కేరళకు వలస వెళ్లాడు. తిరువనంతపురంలో పనులు చేసుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు. ఈక్రమంలో అతను ‘ఫిఫ్టీ – ఫిఫ్టీ’ అనే కంపెనీ లాటరీ టికెట్ కొన్నాడు. అతను కొన్న టికెట్ నంబరుకు రూ.కోటి బహుమతి లభించింది. దీంతో తనపై ఏ సమయంలోనైనా దాడి జరగుతుందని భయపడిపోయాడు.తంపనూర్ పోలీస్‌స్టేషన్‌ను వెళ్లి తన ఇబ్బంది చెప్పుకున్నాడు. తాను గెలుపొందిన లాటరీ గురించి భద్రత కావాలని అభ్యర్థించాడు. లాటరీ డబ్బులు ఎలా పొందాలో కూడా తనకు తెలియదని సహాయం చేయాలని కోరాడు. తనకు ఈ విషయంలో సహాయం చేసిన నిర్వాహకుల నుంచి నగదు ఇప్పించాలని కోరాడు.
దీంతో పోలీసులు సరేనంటూ ఆందోళన పడవద్దని లాంబకు సూచించారు. ఆ తరువాత ఆ ప్రక్రియ పూర్తి చేశారు. ఆతరువాత వచ్చిన డబ్బులను SHO ఫెడరల్ బ్యాంకు మేనేజర్ (Federal bank manager) ను సంప్రదించి ప్రైజ్ మనీ(Prize momey)ని పోలీస్ స్టేషన్ లోనే బ్యాంకు మేనేజర్ కు అందజేశారు. అలా పోలీసులు అతనికి అన్ని దగ్గరుండి డబ్బులను బ్యాంకులో జమ చేసే వరకు సహాయ సహకారాలు అందించారు. ఆ తరువాత ఆ డబ్బులను జాగ్రత్తగా వాడుకోమని రాంబకు సూచించారు. దీంతో లాంబ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయాన్ని పోలీసుల సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.
National Doctors Day 2023 : డాక్టర్ బిసి రాయ్ సేవలు గుర్తు చేసుకుందాం .. హ్యాపీ డాక్టర్స్ డే