Egg Tea Viral : పిచ్చి పీక్స్ ..పచ్చి గుడ్డుతో టీ, యాపిల్‌ని వేపటం ఏంటమ్మా తల్లీ..!!

అంటే అల్లం టీ, ఇలాచీ టీ, మసాలా టీ,గ్రీన్ టీ, లెమన్ టీ, రోజ్ టీ, తులసి టీ,బాదం టీ ఇలా వందల రకాల టీల రుచి చూసి ఉంటారు. కానీ పచ్చి గుడ్డుతో చేసిన ఈ టీని చూశారా..? టేస్ట్ చేస్తారా..?

Egg Tea Viral : పిచ్చి పీక్స్ ..పచ్చి గుడ్డుతో టీ, యాపిల్‌ని వేపటం ఏంటమ్మా తల్లీ..!!

Egg Tea

Updated On : October 10, 2023 / 4:12 PM IST

Egg Tea : టీ అంటే అల్లం టీ, ఇలాచీ టీ, మసాలా టీ,గ్రీన్ టీ, లెమన్ టీ, రోజ్ టీ, తులసి టీ,బాదం టీ, ఇలా వరుసగా వందల రకాల గురించి చెప్పుకోవచ్చు. ఉదయం లేవగానే ఓ కప్పు టీ గొంతులో పడితేనే గానీ పనిలో పడం. ఇలా ఎన్నో టీలు గురించి విన్నాం..చాలామంది రుచి కూడా చూసే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ గురించి బహుశా ఎవ్వరు విని ఉండరేమో..

సాధారణంగా టీ తయారు చేయటంలో ఎవరి స్టైల్ వారిదే. ఒక్కొక్కరు ఒక్కోలా పెడతారు. కానీ ఓ యూటబర్ తయారు చేసిన ఈ వింత టీ గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు. ఈ టీ తాగటం మాట పక్కన పెడితే తయారు చేయటం చూస్తే వాక్ అంటూ వాంతి చేసుకుంటారు. ముందు రోజు తిన్నదంతా కక్కేస్తారు. ఇంతకీ ఏంటా టీ మరీ ఇంత దారుణంగా చెబుతున్నారు ఈ టీ గురించి అని అనుకుంటున్నారా… అదే మరి ఈ వింత టీ గురించి చెప్పాలంటే ఈ మాత్రం ఉండాల్సిందే..

బహుశా కొంతమందే కాదు చాలా మంది కనీ వినీ ఎరుగని ఈ టీ ‘ఎగ్ టీ’..!! పచ్చి గుడ్డుతో తయారు చేసిన టీ..ఏంటీ షాక్ అయ్యారా… అయ్యే ఉంటార్లెండి..ఎందుకంటే ‘గుడ్డుతో టీ’ ఏంట్రా బాబు అని కక్కుకోవటం ఖాయం.

ఓ మహిళా యూటూబర్ ఈ ‘ఎగ్ టీ’ తయారు చేసే ప్రాజెస్ చూస్తే నిజంగానే వాంతి వచ్చేలా ఉంది. ఈ ఎగ్ టీలో యాపిల్ ముక్కలు కూడా వేసింది సదరు యూటూబర్. ఈ ఎగ్ టీ తయారీకి ముందు పొయ్యిమీద ఓ బాండీ పెట్టి..దాంట్టో టీ పొడి, పంచదార వేసి వేగించింది. తరువాత ఓ యాపిల్ ను ముక్కలుగా కట్ చేసి వేసింది. తరువాత ఆ యాపిల్ ముక్కల్ని కూడా కాసేపు వేగించింది. తరువాత ఓ గ్లాసు పాలు పోయింది. కాసేపు మరిగించింది. తరువాత కాస్త పాలపొడి వేస్తు కావాలంటే వేసుకోవచ్చు అంటూ చెప్పింది.

అదంతా మరిగాక అసలు ప్రక్రియ మొదలైంది. మరుగుతున్న యాపిల్ టీలో పచ్చి గుడ్డును పగుల కొట్టి వేసి.. బాగా కలిపింది. కాసేపు ఆగాక దాల్చిన చెక్క, యాలకులు వేసింది. ఇలా కాసేపు ఆ టీని కలుపుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ టీని ఓ కప్పులో వడకట్టి సర్వ్ చేసింది. దానికి ‘ఎగ్ టీ’ అని తెలిసేలా ఓ గుడ్డును డెకరేట్ చేసి పెట్టింది. ఈ ‘ఎగ్ టీ’ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పిచ్చి పిచ్చి వంటకాలు వచ్చినట్లే ఈ వీడియోకు కూడా కామెంట్స్ వచ్చాయి. మరి చూస్తేనే కదా కామెంట్లు వస్తాయి. అందుకే వ్యూస్ కూడా భారీగానే వచ్చాయి. దీనిపై ఆ టీ తాగిన వాళ్లు బతికే ఉన్నారా? అని..సలు నువ్వు ముందు ఆ టీ తాగి చూపించు, అనీ.. లైఫ్ లో ఇంత అసహ్యమైన టీని ఇప్పుడే చూస్తున్నా అనీ..వావ్ వాటే క్రియేటివిటీ అంటూ విరుపులు,విసుర్ల కామెంట్లు వచ్చాయి.

ఏది ఏమైనా సోషల్ మీడియాలో గొప్ప గొప్ప వంటకాలతో పాటు పిచ్చి పీక్స్ వెళ్లిందా..? అనేలాంటి వంటకాలు పిచ్చ పిచ్చగా వైరల్ అవుతుంటాయి. అటువంటిదే ఈ ‘ఎగ్ వింత్ యాపిల్ టీ’ కూడా అనేలా ఉంది..మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ గుడ్డు టీ పై..