వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారికి గణతంత్ర దినోత్సవం వేళ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలను ప్రకటిస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ అంశాల్లో ఈ పురస్కారాలను ప్రకటిస్తారు.
మెగాస్టార్ చిరంజీవికి గతంలో పద్మభూషణ్ అవార్డు వస్తే ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. అలాగే మరికొంత మంది ప్రముఖులను ఒక్కటి కన్నా ఎక్కువ ‘పద్మ’ అవార్డులు వరించాయి.
- చిరంజీవి: పద్మభూషణ్ అవార్డు-2006లో.. పద్మవిభూషణ్ అవార్డు 2024లో..
- అక్కినేని నాగేశ్వరరావు: పద్మవిభూషణ్ (2011), పద్మ భూషణ్ (1988), పద్మశ్రీ (1968)
- రజినీకాంత్: పద్మవిభూషణ్ (2016), పద్మ భూషణ్ (2000)
- అమితాబచ్చన్: పద్మవిభూషణ్ (2015), పద్మ భూషణ్ (2001), పద్మశ్రీ (1984),
- కమల హాసన్: పద్మ భూషణ్ (2014), పద్మశ్రీ (1990)
- ఎంఎస్ ధోనీ: పద్మ భూషణ్ (2018), పద్మశ్రీ (2009)
- రాహుల్ ద్రవిడ్: పద్మశ్రీ (2004) పద్మ భూషణ్ (2013)
- ఇళయరాజా: పద్మవిభూషణ్ (2018), పద్మ భూషణ్ (2010)
- ఆమిర్ ఖాన్: పద్మశ్రీ (2003) పద్మ భూషణ్ (2010)
- A. R. రెహమాన్: పద్మ భూషణ్ (2010), పద్మశ్రీ (2000)
- S. P. బాలసుబ్రహ్మణ్యం: పద్మవిభూషణ్ (2021 మరణానంతరం), పద్మ భూషణ్ (2011), పద్మశ్రీ (2001)
Padma Vibhushan : ఇప్పటివరకు పద్మవిభూషణ్ అందుకున్న నటులు వీరే