Padma Vibhushan : ఇప్పటివరకు పద్మవిభూషణ్ అందుకున్న నటులు వీరే

భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత రెండవ పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' 2024లో చిరంజీవి, వైజయంతిమాల అందుకోబోతున్నారు. అయితే గతంలో ఈ సత్కారాన్ని అందుకున్న నటులు ఎవరో తెలుసుకుందాం.

Padma Vibhushan : ఇప్పటివరకు పద్మవిభూషణ్ అందుకున్న నటులు వీరే

Padma Vibhushan

Updated On : January 26, 2024 / 1:45 PM IST

Padma Vibhushan : భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి పద్మవిభూషణ్ -5 , పద్మభూషణ్- 17, పద్మశ్రీ -110 మంది అందుకోబోతున్నారు. అయితే ఇప్పటివరకు పద్మవిభూషణ్ అందుకున్న నటులు ఎవరో తెలుసుకోండి.

దిలీప్ కుమార్
దివంగత బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ 2015లో పద్మవిభూషణ్ సత్కారం అందుకున్నారు.

Komatireddy Venkat Reddy : చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి సత్కారం.. భారతరత్న కూడా రావాలని

అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులు పొందిన అమితాబ్ బచ్చన్ ని పద్మవిభూషణ్ వరించింది. 2015లో అమితాబ్ పద్మవిభూషణ్ అందుకున్నారు.

రజినీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రంగంలో చేసిన సేవలకు గాను 2016లో పద్మవిభూషణ్ అందుకున్నారు.

Chiranjeevi : పద్మ విభూష‌ణ్ అవార్డు పై స్పందించిన చిరంజీవి

అక్కినేని నాగేశ్వరరావు
దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు 2011లో పద్మవిభూషణ్ అందుకున్నారు.

చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి 2024లో పద్మవిభూషణ్ సత్కారానికి ఎంపిక అయ్యారు. ప్రముఖ నటి వైజయంతిమాల సైతం చిరంజీవితో పాటు పద్మవిభూషణ్ అందుకోబోతున్నారు.