Cow-Snake friendship : ఆవు, నాగుపాముల స్నేహం .. స్వచ్ఛమైన ప్రేమకు నమ్మకం

సోషల్ మీడియా మరో అద్భుతమైన,అరుదైన వీడియో వైరల్ అవుతోంది. స్నేహానికి కొత్త అర్థం చెప్పే వీడియో స్వార్థం పెరిగిపోయిన మనుషులను ఆలోచింపజేస్తోంది. పగలు ప్రతీకారాల మరచి స్నేహాన్ని ఇచ్చి ప్రేమను చూపించమని సందేశం ఇస్తోంది అరుదైన వీడియో..

Cow-Snake friendship : ఆవు, నాగుపాముల స్నేహం .. స్వచ్ఛమైన ప్రేమకు నమ్మకం

cow and snake playing

Updated On : August 4, 2023 / 5:10 PM IST

Cow and snake friendship viral video : మనుషుల్లో రోజు రోజుకు స్వార్ధం పెరిగిపోతు..శతృత్వాలను పెంచుకుంటుంటే జంతువులు, విషసర్పాలు మాత్రం తమ జాతి వైరాన్ని మర్చిపోయి కలిసి మెలిసి ఆడుకుంటున్నాయి. జాతి వైరాన్ని మరిచిన జంతువుల వీడియోలో సోషల్ మీడియాలో చూస్తుంటాం. అటువంటివి చూస్తుంటే మనుషులే సిగ్గు పడాల్సిన పరిస్థితి. కానీ సాధు జంతువులైనా, క్రూర మృగాలైనా, విషసర్పాలైనా తమకు హాని కలుగుతుంది అంటేనే దాడి చేస్తాయి.లేదంటే వాటి మానాన అవి జీవిస్తుంటాయి.Cow and snake friendship viral video

కానీ మనిషి మాత్రం స్వార్థంతో..అంతులేని ఆశలతో దురాశపరులుగా మారి దోపిడీలు,దొంగతనాలు, హత్యలు,కిరాతకాలకు పాల్పడుతు తను మనిషిని అనే విషయం మర్చిపోతున్నాడు. క్రూర మృగాల కంటే విషసర్పాల కంటే దారుణంగా మారిపోతున్నాడు. తోటి మనిషిని కూడా సాటి మనిషిగా చూడలేకపోతున్నాడు. కానీ నోరులేని మూగ జీవాలు మాత్రం జాతి వైరాన్ని మరిచి కలిసి మెలిసి ఆడుకుంటున్న దశ్యం..ఓ ఆవు, ఓ నాగుపాము కలిసి ఆడుకుంటున్న(Cow and snake friendship) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవు పాము పడగపై తన నాలుకతో ప్రేమగా నిమిరింది. దానికి ఆ విషసర్పం కూడా అంతే వినయాన్ని ప్రదర్శిస్తు పడగను కిందకు దించింది. నిజంగా హృదయాలను తాకుతోంది ఈ దృశ్యం..

సోషల్ మీడియా సైట్ Xలో వేలాది లైక్‌లు పొందింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేసిన వీడియోలో ఆవు, పాము కలిసి ఆడుకునే అత్యంత అరుదైన,విచిత్రమైన దృశ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద (Susanta Nanda )షేర్ చేశారు.

17 సెకన్ల వీడియోలో గేదె, పాము ఒకదానితో ఒకటి ఆడుకోవడం కనిపిస్తుంది. వాటి మధ్య భయం లేదు. పోట్లాడుకోవడం లేదు. ప్రేమ, ఆప్యాయత కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలను చూసి ఆనందించడమే కానీ, వివరించడం కష్టం అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రేమ ద్వారా లభించిన నమ్మకం” అని రాశారు. పలువురు వినియోగదారులు పోస్ట్‌పై ఆసక్తికరమైన కామెంట్‌లు చేశారు.

కాగా పాముకాటుతో మనుషులేకాదు పశువులు కూడా చనిపోతున్నాయి. కానీ ఈ వీడియో మాత్రం పాము, గోమాతల మధ్య ప్రేమానురాగాలను ప్రతిబింభిస్తోంది. ఇది నిజంగా అపురూపమే అని చెప్పితీరాలి.