Viral video : హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్లు కురిపించిన యువకుడు .. ఏరుకోవానికి ఎగబడ్డ జనాలు

గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. అది చూసిన జనాలు నోట్లను ఏరుకోవానికి ఎగబడ్డారు. ఎవరికి దొరికింది వారు ఏరుకున్నారు.

Rain of currency notes from helicopter

Rain of currency notes from helicopter : గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. అది చూసిన జనాలు నోట్లను ఏరుకోవానికి ఎగబడ్డారు. ఎవరికి దొరికింది వారు ఏరుకుని చక్కగా దాచుకున్నారు. హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం కురిసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక మిలియన్ డాలర్లు వర్షంలా కురవటంతో ఆ నోట్లను ఏరుకోవటానికి జనాలు భారీగా ఎగబడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చెక్ రిపబ్లిక్ లోని నాడె లాబెమ్ పట్టణానికి సమీపంలో హెలికాప్లర్ నుంచి మిలియన్ డాలర్లు వర్షంలా కురిసింది. ఇన్ ప్లుయోన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ హెలికాప్టర్ నుంచి నోట్ల వర్షాన్ని జనాలపై కురిపించాడు. మిస్టర్ బార్టోస్టైక్, కజ్మా అనే మారుపేరుతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో కమిల్ ఓ పోటీని నిర్వహించాడు. దాంట్లో విజేతకు భారీ నగదుని బహుమతిగా ప్రకటించాడు.

ఈ పోటీలో భాగంగా ‘వన్ మాన్ షో ది మూవీలో పొందు పరిచిన కోడ్ ను ఛేధించాలి. కానీ ఈ కోడ్ ను ఎవరు పరిష్కరించలేకపోయారు. అలాగని కమిల్ ఆ సొమ్మును అలా ఉంచాలనుకోలేదు. దాన్ని పోటీదారులకు పంచేయాలని అనుకున్నాడు. కానీ ఈ డబ్బును పోటీదారులకు అందించటం కూడా వినూత్నంగా ఉండాలనుకున్నాడు. దీంట్లో భాగంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు డబ్బును తీసుకునేందుకు ఓ ప్రదేశానికి రావాలని పోటీదారులకు ఎన్‌క్రిప్టెడ్ సమాచారంతో ఈ మెయిల్ పంపాడు.

Raas Festival : రూ.100లకే రేంజ్‌రోవర్‌, ఫార్చ్యూనర్, స్కోడా కార్లు .. ఎగబడి కొనేస్తున్న జనాలు

చెప్పిన సమయానికి ఓ కంటైనర్ లో మిలియన్ డాలర్ల కరెన్సీని లోడ్ చేసుకుని అతను చెప్పిన ఏరియాకు వచ్చాడు. లాబెమ్ పట్టణానికి సమీపంలోని ఓ ప్రదేశంలో హెలికాఫ్టర్‌ ద్వారా నోట్లను వెదజల్లాడు. అతను అందించిన సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకున్నవారంతా ఆ నోట్లను ఏరుకునేపనిలో పడ్డారు. 1000,000 డాలర్లు అంటూ భారతీయ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.83 కోట్లకు పైనే.

కమిల్ హెలికాప్టర్ ద్వారా నోట్లు కురిపిస్తుంటం చూసిన ఆ చుట్టుపక్కల పొలాల్లో పనిచేసుకునేవారు కూడా వచ్చి ఏరుకున్నారు. సంచుల్లో నింపుకున్నారు. కజ్మా వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ డబ్బును 4000మంది వ్యక్తులు ఏరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కజ్మా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. నోట్లను దక్కించుకునే క్రమంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అంతా సజవుగానే జరిగిందని కజ్మా వెల్లడించాడు.