Raas Festival : రూ.100లకే రేంజ్‌రోవర్‌, ఫార్చ్యూనర్, స్కోడా కార్లు .. ఎగబడి కొనేస్తున్న జనాలు

రూ.70లక్షలకు పైనే ధర ఉండే కార్లు కేవలం రూ.100లకే వస్తాయంటే జనాలు ఊరుకుంటారా..? ఎగబడి మరీ కొనేస్తారు. పోతే రూ.100లు పోతుంది అనుకున్న జనాలు ఎగబడి మరీ కొనేస్తున్నారు.రూ.100లకే రేంజ్‌రోవర్‌, ఫార్చ్యూనర్, స్కోడా కార్లు వంటి ఖరీదైన కార్ల ఆఫర్..

Raas Festival : రూ.100లకే రేంజ్‌రోవర్‌, ఫార్చ్యూనర్, స్కోడా కార్లు .. ఎగబడి కొనేస్తున్న జనాలు

Assam Raas Festival Range Rover and Fortuner Cars

Assam Raas Festival Range Rover and Fortuner Cars : రూ.70లక్షలకు పైనే ధర ఉండే కార్లు కేవలం రూ.100లకే వస్తాయంటే జనాలు ఊరుకుంటారా..? ఎగబడి మరీ కొనేస్తారు. పోతే రూ.100లు పోతుంది అనుకున్న జనాలు ఎగబడి మరీ కొనేస్తున్నారు. అస్సాంలో ఈ వినూత్న ఆఫర్ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. కేవలం రూ.100లకే రూ.70 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ కారు, రూ.50లక్షలు ఖరీదు చేసే టాయోటా ఫార్చ్యూనర్,స్కార్పియో,స్కోడా కుచక్ వంటి కార్లు కేవలం రూ.100 టికెట్ ధరపై ఏర్పాటు చేశారు లాటరీ నిర్వాహకులు.

అసోంలోని బార్ పేట జిల్లాలోని హౌలీ  రాస్ ఫెస్టివెల్ (Raas Festival)‌ లో ఖరీదైన కార్లు కేవలం రూ.100 లకే ఏర్పాటు చేయటం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతోంది. అస్సాంలో ప్రతీ ఏటా హౌలీలో రాస్ వేడుకలు నిర్వహిస్తారు.ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయంలో భాగంగా పండుగ ముందు ఈ లాటరీ ఈవెంట్ ని నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. లాటరీలో గెలుపొందిన విజేతకు ఖరీదైన కార్లను బహుమతిగా అందిస్తుంటారు. ప్రతీ సంవత్సరం వలెనే ఈ ఏడాది కూడా ఖరీదైన కార్లను ఏర్పాటు చేశారు. రూ.100 పెట్టి టికెట్ కొంటే మొదటి బహుమతిగా రూ.76 లక్షల రేంజ్ రోవర్, రెండో బహుమతిగా రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, ఆ తరువాత విజేతలకు స్కార్పియో, స్కోడా కుచక్, నెక్సాన్‌ వంటి ఖరీదైన కార్లను అందజేస్తారు.

High Court : నసగొద్దు .. పాయింట్‌కు రండి అంటూ జడ్జిపై మరో జడ్జి అసహనం

హౌలీ రాస్ వేడుకలు అనేవి శ్రీకృష్ణుడు, రాధల ప్రేమలకు ప్రతిరూపంగా నిర్వహించే పండుగ. ఈ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది కూడా ఖరీదైన కార్లను అందజేసేందుకు నిర్వహకులు లాటరీ ధరను కేవలం నామమాత్రపు ధరగా రూ.100గా నిర్ణయించారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు రాస్ వేడుకలు నిర్వహించనున్నారు. లాటరీ విజేతలను డిసెంబర్ 10న ప్రకటిస్తారు. ఈ ఖరీదైన లాటరీ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోతే రూ.100 వస్తే ఖరీదైన కారుగా భావించిన ఆశావహులు హౌలీలోని గిఫ్ట్ కూపన్ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ ఏడాది 4 లక్షల టిక్కెట్లను విక్రయించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. కాగా..2022లో ఈ రాస్ వేడుకల్లో గువహాటికి చెందిన జనార్దన్ బోరో అనే పోలీసు అధికారి మొదటి బహుమతి కింద ఆడి కారును గెలుచుకున్నారు.

బార్‌పేట జిల్లా‌లోని హౌలీ రాస్ మహోత్సవ్ అనేది భారతీయ సంప్రదాయ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసం అయిన కార్తీక పూర్ణిమ తిథిలో జరుపుకుంటారు. దీంట్లో భాగంగా ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు రాస్ వేడుకలు జరగనున్నాయి. ఈ పండును అస్సాం వాసులు చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ వేడుకలు మా సంస్కృతి అని మురిసిపోతారు. ఈ వేడులకు జరగకపోతే తమకు ఏదో వెలితిగా ఉంటుందని అంటారు. అంటే ఈ పండుగకు అస్సామీయులు ఎంతటి ప్రాముఖ్యతనిస్తారో అర్థం చేసుకోవచ్చు.

ఈ వేడుకల్లో ఎక్కడ చూసిని శ్రీకృష్ణుని గాధలే కనిపిస్తాయి. వినిపిస్తాయి. కృష్ణుడి జీవితాన్ని నృత్య, నాటక, సంగీత ప్రదర్శనల ద్వారా జరుపుతారు.కృష్ణుని జీవితంలోని వివిధ దశలను చూపరులను ఆకట్టుకునేలా నిర్వహిస్తారు. కృష్ణుడి బాల్యం నుంచి గోపికలతో ఆటపాటలు, రాసలీలు వంటి ఎన్నో మహత్తర ఘట్టాలను ఆవిష్కరిస్తారు.