High Court : నసగొద్దు .. పాయింట్‌కు రండి అంటూ జడ్జిపై మరో జడ్జి అసహనం

 ‘నసగొద్దు..పాయింట్ కు రండి’ అంటూ ఓ న్యాయమూర్తిపై మరో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

High Court : నసగొద్దు .. పాయింట్‌కు రండి అంటూ జడ్జిపై మరో జడ్జి అసహనం

Gujarat High Court

Gujarat High Court : ‘నసగొద్దు..పాయింట్ కు రండి’ అంటూ ఓ న్యాయమూర్తిపై మరో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. గుజరాత్ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య జరిగిన వాగ్వాదం హాట్ టాపిక్ గా మారింది. ఓ కేసులో విచారణ సందర్భంగా జస్టిస్ బీరెన్ వైష్ణవ్, జస్టిస్ మౌనా భట్ మధ్య సోమవారం (అక్టోబర్ 23,2023)న వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు హైకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారంలో వెల్లడయ్యింది. ఆ తరువాత ఈ దీనికి సంబంధించిన దృశ్యాలను తొలగించినప్పటికీ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి.

ఓ కేసుకు సంబంధించి ఇరు న్యాయవాదుల వాదనలు విన్నాక..ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ బిరేన్ వైష్ణవ్, జస్టిస్ మౌనా భట్ మధ్య వివాదం చోటుచేసుకుంది. తీర్పు విషయంలో ఇద్దరు మధ్యా భిన్నాభిప్రాయాలు చోటుసుకోవటంతో ఇద్దరు వాదించుకున్నారు. ఈ క్రమంలో సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బిరేన్ తీవ్ర అసహనానికి లోనై తన చేతిలో ఉన్న ఫైల్ ను విసిరేశారు.

అనంతరం ‘‘తీర్పు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే మీరు విడిగా తీర్పు ఇవ్వండీ అంతే గానీ నసుగుతూ (గొణుక్కోకండి) మాట్లాడటం ఆపండీ’’ అంటూ జస్టిస్ మౌనా భట్‌తో అసహనానికి గురయ్యారు. అంతేకాదు ఇకనుంచి తామిద్దం కలిసి కేసులు విచారించేది లేదరంటూ ఆయన సీటునుంచి లేచి కోర్డు హాలు నంచి వెళ్లిపోయారు. దీంతో తీర్పు వాయిదా పడింది. ఆ మరునాటి నుంచే దసా సెలవులు కావటంతో బుధవారం జస్టిస్ బిరేన్ వైష్ణవ్, జస్టిస్ మౌనా భట్ సమక్షంలోనే తన ప్రవర్తనపై విచారం వ్యక్తం చేస్తు క్షమాపణ చెప్పారు.