Hospitals Colors : ఆస్పత్రుల్లో ఆకుపచ్చ, నీలం రంగులనే ఎందుకు వాడతారో తెలుసా..?

 ఆస్పత్రుల్లో డాక్టర్లు సర్జరీలు చేసే సమయంలో ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరిస్తారు. రోగికి కూడా ఆకుపచ్చ దుస్తులు వేస్తారు. సాధారణంగా అన్ని ఆస్పత్రుల్లోనే ఇవే రంగులు ఉంటాయి. దీని వెనుకున్న కారణమేంటీ..? రోగిపై ఈ రంగుల ప్రభావం ఉంటుందా..?

green, blue colors used in hospitals

hospitals green.. blue colors : ఆస్పత్రుల్లో డాక్టర్లు సర్జరీలు చేసే సమయంలో ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరిస్తారు. రోగికి కూడా ఆకుపచ్చ దుస్తులు వేస్తారు. సాధారణంగా అన్ని ఆస్పత్రుల్లోనే ఇవే రంగులు ఉంటాయి. ఆస్పత్రిలో మరి ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్స్ లో కిటీలకు కరెన్లు కూడా ఆకుపచ్చవే ఉంటాయి. డాక్టర్లు, నర్సులు ఆకుపచ్చ దుస్తులే ధరిస్తారు. మరి ఆ స్పత్రుల్లో ఆకుపచ్చ, నీలం రంగులు మాత్రమే ఎందుకు వినియోగిస్తారు? అని ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ రెండు రంగులే ఎందుకు వినియోగిస్తారు..?

ఆకుపచ్చ రంగు క్షేమానికి, సస్యశ్యామలానికి గుర్తు. ప్రకృతికి గుర్తు. పచ్చగా కళకళలాడే ప్రకృతిలో ఉంటే మనిషికి ఆహ్లాదం కలుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆస్పత్రుల్లో ఆకుపచ్చ రంగు వెనుక కూడా ఇదే అర్థముంది.అంతేకాదు ఆస్పత్రుల్లో సాధారణంగా రక్తం మకరలు కనిపించే అవకాశం అవి అంటుకునే అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది..

Potassium : శరీరంలో పొటాషియం లోపిస్తే ఈ అనారోగ్యసమస్యలు తప్పవా ?

ఆకుపచ్చ కాకుండా వేరే రంగు దుస్తులు ధరిస్తే రక్తపు రంగు ఎరుపు ఆ దుస్తులమీద పడితే రంగు మరింత బాగా కనిపించి రోగులను ఆందోళనకు గురిచేస్తుంది. అది రోగికి మంచిది కాదు. ఆందోళనతో బీపీ పెరిగే అవకాశాలుంటాయి. ఆకుపచ్చ రంగు దుస్తులపై రక్తం పడితే అది ఎర్రగా కనిపించదు. కాస్త రంగు మారి కనిపిస్తుంది. అంటే రక్తపు రంగుని తనలో ఇమిడ్చేసుకుని ఎర్రటి రంగులో కనిపించనివ్వదు ఆకుపచ్చరంగు. ఆకుపచ్చ రంగు దుస్తులపై రక్తం పడినా అది ఎర్రగా కాకుండా నల్లగా కనిపిస్తుంది.

ఎందుకంటే ఆకుపచ్చ, ఎరుపు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైన రంగులు. రెండు ముదురు రంగులు. కాబట్టి ఈ రెండు రంగులూ ఒకదానిలో ఒకటి కలిసిపోయి కొత్త రంగును సంతరించుకుని నల్లటి రంగు కనిపిస్తుంది. అంటే ఆకుపచ్చ రంగు మీద పడ్డ రక్తపు మరకలు నల్లగా కనిపించడం వల్ల రోగికి భయం అనిపించదు. అందువలనే ముఖ్యంగా ఆపరేషన్‌ థియేటర్లలో డాక్టర్లు, నర్సులు ఆకుపచ్చని దుస్తులు ధరిస్తారు. కొన్ని ఆస్పత్రి వార్డుల్లో పేషెంట్లకు కూడా ఆకుపచ్చని దుస్తులు ధరింపజేస్తారు.

Sleepless Nights : మనం చేసే రోజువారి తప్పులే నిద్రలేని రాత్రులు గడపటానికి కారణమా ?

అదే నీలం రంగును చూస్తే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. నీలాకాశాన్ని చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా..అలాగే నీలం రంగు సముద్రాన్ని చూసినా ఆహ్లాదంగా కనిపిస్తుంది. నీలం రంగులోనే ఆహ్లాదం ఉంటుంది. ఆస్పత్రుల్లో నీలం రంగు వినియోగించటం వెనుక రోగి ప్రశాతంగా ఉంచటానికి ఏర్పడింది.అలాగే రోగితోపాటు వారి బంధువులు కూడా ప్రశాంతంగా ఉంటే రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.రోగి మనస్సుపై నీలం రంగు పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుంది.నీలం రంగు శరీరాన్ని శాంతపరుస్తుంది. మనస్సుపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది.

మానవ జీవక్రియలు నీలం రంగు నెమ్మది పరుస్తుంది. శాంతి స్వభావాన్ని కలిగిస్తుంది. ఆకలిపై నీలం రంగు ప్రభావంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఆస్పత్రుల్లో రోగులకు పెట్టే ఆహారం చాలా ముఖ్యమైనది. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని పెడతారు. రోగికి ఆకలిని తగ్గిస్తుందట నీలం రంగు. ఇలా ఆస్పత్రుల్లో నీలం రంగు,ఆకుపచ్చ రంగుల ఏర్పాటువెనుక ఇటువంటి ఆసక్తికర..ఉపయోగకరమైన కారాణాలున్నాయట..

ట్రెండింగ్ వార్తలు