Potassium : శరీరంలో పొటాషియం లోపిస్తే ఈ అనారోగ్యసమస్యలు తప్పవా ?

కండ‌రాలు బ‌ల‌హీనంగా మారటం, ప‌ట్టుకుపోయిన‌ట్లు ఉండంతోపాటు అల‌స‌ట‌, గుండె వేగంగా కొట్టుకోవటం, ఆక‌లి లేక‌పోవ‌డం, మానసిక కుంగుబాటు, హైపోక‌లేమియా, వాంతులు, విరేచ‌నాలు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అంతేకాకుండా పొటాషియం లోపం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది.

Potassium : శరీరంలో పొటాషియం లోపిస్తే ఈ అనారోగ్యసమస్యలు తప్పవా ?

Hypokalemia

Potassium : శరీరలోని అనేక క్రియల నిర్వాహణకు పొటాషియం కీలకం. కండ‌రాలు మొదలు నాడుల ప‌నితీరు, గుండె కొట్టుకోవ‌డం, శ‌క్తిని ఉత్ప‌త్తి చేయ‌డం, న్యూక్లిక్ యాసిడ్లు, ప్రోటీన్ల సంశ్లేష‌ణ వంటి ప‌నుల‌కు పొటాషియం అవ‌స‌రత ఎంతో ఉంది. నీటిస్ధాయిని నియంత్రించటంతోపాటు, కణాలకు పొటాషియం అవసరం అవుతుంది.

READ ALSO : Healthy Heart : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలను మీ ఆహారంలో చేర్చుకోండి !

ఇది లోపిస్తే కండ‌రాలు బ‌ల‌హీనంగా మారటం, ప‌ట్టుకుపోయిన‌ట్లు ఉండంతోపాటు అల‌స‌ట‌, గుండె వేగంగా కొట్టుకోవటం, ఆక‌లి లేక‌పోవ‌డం, మానసిక కుంగుబాటు, హైపోక‌లేమియా, వాంతులు, విరేచ‌నాలు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అంతేకాకుండా పొటాషియం లోపం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. శరీరంలో పొటాషియం లోపం చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

READ ALSO : Children Heart Health : మీ పిల్లల గుండె ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ?

ఒక మనిషికి ప్రతిరోజు 2.5 నుంచి 3.5 గ్రాముల వ‌ర‌కు పొటాషియం అవ‌స‌రం అవుతుంది. దీనిని మ‌నం తినే ఆహారాల నుంచే పొందవచ్చు. ఎలాంటి స‌ప్లిమెంట్ల‌ను వాడాల్సిన అవసరం లేకుండానే ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవ‌చ్చు.

READ ALSO : Brushing Your Teeth : రాత్రిపూట పళ్ళు తోముకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుందా ?

పొటాషియం లోపనివారణకు ;

పొటాషియం శరీరానికి అందాలంటే కొన్ని రకాల ఆహారాలను రోజువారిగా తీసుకోవటం మంచిది. అలాంటి వాటిలో కోడిగుడ్లు, ట‌మాటాలు, , న‌ట్స్‌, అర‌టి పండ్లు,చిల‌గ‌డ దుంప‌లు, యాప్రికాట్స్‌, చేప‌లు, తృణ ధాన్యాలు, పెరుగు, పాలు, మాంసం, నారింజ, త‌ర్బూజా, క్యారెట్‌, కివీ, కొబ్బ‌రినీళ్లు, బీట్‌రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది. వీటిని త‌ర‌చూ తీసుకోవటం వల్ల పొటాషియం లోపాన్ని నివారించవచ్చు.