Dutch director Frans Hofmeester daughter born to 20 Years Pics
Dutch director Frans Hofmeester daughter born to 20 Years Pics video : తండ్రికి ఆడపిల్లలు ఎప్పుడు మురిపెమే. బుజ్జి బుజ్జి జుబ్బాలు వేసుకునే బుజ్జాయి అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందో అని తండ్రి మురిసిపోతాడు. నిన్నా మెన్నా నా గుండెలమీద తన్నుతు ఆడుకున్న చిట్టితల్లి అప్పుడే ఎంత ఎదిగిపోయిందో అని సంతోషపడిపోతాడు. పిచ్చి తండ్రి పిచ్చిప్రేమ అటువంటిది. తల్లి ప్రేమ ముందు తండ్రి ప్రేమ ఎప్పుడు తేలిపోతునే ఉంటుంది. అయినా ఆడబిడ్డలపై తండ్రి పెంచుకునే అపురూపం..అనిర్వచనీయమైన ఆ ప్రేమ గురించి చెప్పటానికి మాటలు సరిపోవు.
దానికి ఓ తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నిదర్శనమని చెప్పాల్సిందే.
కూతురు పుట్టినప్పటినుంచి 20 ఏళ్లు వచ్చే వరకు క్రమం తప్పకుండా ప్రతీ వారం ఫోటో తీయటం దాని దాచిపెట్టటం చేసేవాడు. ఆలా ఆ ఫోటోలన్నీ ఓ వీడియో చేసిన నా బిడ్డకు ఇప్పుడు 20 ఏళ్లు వచ్చాయి అంటూ ఈ ఫోటోలను వీడియో చేసి పోస్ట్ చేశాడు. నా బిడ్డ ఎంతగా ఎదిగిపోయిందో అని మురిసిపోయాడు. అలా 20ఏళ్లపాటు ప్రతీ వారం తీసిన ఫోటోలను వీడియో చేసి సోషల్ మీడియోలో పోస్ట్ చేయటంతో అది వైరల్ అవుతోంది. రెండు నిమిషాల, 18 సెకన్ల నిడివి గల వీడియోలో, శిశువు యువతిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది.
ఓ తండ్రి తన కూతురు పుట్టినప్ప నుంచి ప్రతీ వారం క్రమం తప్పకుండా ఫోటోలు తీసి వాటిని అపురూపంగా దాచుకున్నాడు. అలా ఆ పసిబిడ్డ పెరిగి పెద్దది అవుతున్న కొద్దీ కూతురులో వచ్చిన మార్పుల్ని చూసి మురిసిపోయేవాడు. ఆ ఫోటోలను భద్రంగా దాచుకునేవాడు. అతనే డచ్ డైరెక్టర్ ఫ్రాన్స్ హాఫ్‌మెస్టర్ షేర్ చేసిన వీడియో అమితంగా ఆకట్టుకుంటోంది.
ఆయన ఒక టైమ్‌లాప్స్ వీడియో రూపొందించారు. ఈ వీడియో కోసం ఆయన 20 ఏళ్ల పాటు ప్రతీవారం తమ కుమార్తెకు ఫొటోతీస్తూ వచ్చారు. ఆ ఫొటోలన్నింటినీ ఇప్పుడు టైమ్‌లాప్స్ వీడియోగా రూపొందించారు. 2 నిముషాల 18 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో అతని కుమార్తె చిన్నప్పటి నుంచి ఎలా రూపాంతరం చెందుతూ వచ్చి..అందమైన అమ్మాయిగా ఎలా మారిందో కనిపిస్తుంది. బాల్యం నుంచి నేటి వరకూ ఆమె ముఖంలో చోటుచేసుకున్న మార్పులను ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అలా తన కూతురు 20 పుట్టిన రోజుకు ఆ వీడియోను కానుకగా ఇచ్చాడు.
The father filmed his daughter’s photo every week until she turned 20.
— Tansu YEĞEN (@TansuYegen) August 7, 2023
డైరెక్టర్ ఫ్రాన్స్ హాఫ్‌మెస్టర్ ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ రెడిట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు. వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.