Shirt Buttons : షర్ట్ బటన్స్ లేడీస్‌కు ఎడమవైపు, జెంట్స్‌కు కుడివైపు ఎందుకుంటాయి..? దీని వెనుక ఇంత కథ ఉందా..?
ఆడవాళ్లు, మగవాళ్లు కూడా ధరించే షర్టుల విషయంలో మీరెప్పుడైనా ఓ విషయం గమనించారా? అదే ‘షర్టు బటన్స్ ఉండే సైడ్. అంటే అబ్బాయిలు ధరించే షర్టు బటన్స్ కుడివైపున..ఆడవాళ్లు ధరించే షర్టు బటన్స్ ఎడమవైపున ఉంటాయి. ఇవి ఇలాఎందుకున్నాయి అని మీరెప్పుడైనా గుర్తించారా?

ladies and gents shirt buttons sides
ladies and gents shirt buttons sides : మనం రోజు చూసేవే అయినా చాలా విషయాలను గుర్తించం. అసలు తేడా ఉందనే ఆలోచనే రాదు. మనం రోజు ధరించే దుస్తుల విషయం కూడా అదే జరుగుతుంటుంది. అటువంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోది తెలుసుకోబోయేది.. ఫ్యాషన్..ఫ్యాషన్..ఫ్యాషన్..ఈ ఫ్యాషన్ ప్రపంచం జెట్ స్పీడ్ తో పరిగెడుతోంది. ఎన్నో మోడల్స్ వస్తున్నాయి. ప్రపంచంలో ఎన్నో మార్పులొస్తున్నాయి. ఆడమగా ఇప్పుడు మోడ్రన్ దుస్తులు ధరించటం సర్వసాధారణమైపోయింది.
అటువంటి మోడ్రన్ దుస్తులు ఎన్ని వచ్చినా ప్యాంట్,షర్టు అనేది కామన్ అనే చెప్పాలి. ఆడవాళ్లు, మగవాళ్లు కూడా ధరించే షర్టుల గురించి చెప్పుకుంటే పెద్దగా గమనించని విషయం ఒకటుంది. అదే ‘షర్టు బటన్స్ ఉండే సైడ్. అంటే అబ్బాయిలు ధరించే షర్టు బటన్స్ కుడివైపున ఉంటాయి. అలాగే ఆడవాళ్లు ధరించే షర్టు బటన్స్ ఎడమవైపున ఉంటాయి. ఇవి ఇలా ఉన్నాయనే విషయం మీరెప్పుడైనా గుర్తించారా? గుర్తిస్తే దీని వెనుక ఉన్న కారణమేంటి..? దీనికేమన్నా కథా కమామీషు ఉందా..? అనే డౌట్ మీకెప్పుడన్నా వచ్చిందా..? ఈ కుడి, ఎడమల తేడా ఏంటో చూసేద్దాం..
పూర్వం యూరోపియన్ మహిళలు దుస్తులు ధరించిన విధానాన్ని అనుసరించి ఇలా గుండీలు ఉండే విధానంలో మార్పులు వచ్చాయని తెలుస్తోంది. రీనేసన్స్ ( పునరుజ్జీవనోద్యమం) విక్టోరియా శకం లాంటి చారిత్రక కాలాలను మహిళలు దుస్తులు, పురుషుల దుస్తులు కంటే ఎంతో భిన్నంగా, క్లిష్టంగా ఉండేవట. అప్పట్లో సంపన్నులైన ఆడవారు విలాసవంతమైన దుస్తులు ధరించేవారట. సంపన్న కుటుంబాల్లో కదిలినా..మెదిలినా పనివారు అడుగులకు మడుగులు ఒత్తేవారు.
peanuts packs : విమానంలో పల్లీలు ఎవ్వరు తినకూడదట, అందుకే ఆమె అన్నీ కొనేసింది..
దీంతో శ్రీమంతుల కుటుంబాల్లో ఆడవారి దుస్తులను ఎక్కువగా పనివారే తొడిగేవారట. వారికి బటన్స్ పెట్టాలంటే సేవకులకు అనుగుణంగా ఉండేలా ఆడవారు ధరించే షర్టులకు ఎడమ వైపుకు అమర్చేవాళ్లట. సేవకులు తమ యజమాని దుస్తులను కుడివైపు బటన్‌ను పెట్టేందుకు వీలుగా దర్జీలు ( బట్టలు కుట్టేవారు,టైలర్లు) బటన్‌లను ఆ వైపుగా కుట్టడం ప్రారంభించారట. అంతేకాదు దుస్తులు ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటంతో మహిళల బట్టలు ఎడమవైపు బటన్‌లను ఏర్పాటు చేసారట. అలాగే మరికొందరి అభిప్రాయం ఏమంటే..చాలామంది మహిళలు తమ బిడ్డకు పాలు ఇచ్చేందుకు బిడ్డను ఎడమచేతిలో పట్టుకుని ఇస్తారని..అందుకని ఆడవాళ్ల షర్టు బటన్స్ కుడివైపుకు ఉండేలా ఏర్పాటు చేసి ఉంటారని చెబుతున్నారు. అలాగే అప్పట్లో మహిళలు మగవారితో కలిసి గుర్రపు స్వారీకి వెళ్లే సమయంలో వెనక కూర్చునే వారట. అటువంటి సమయంలో గాలి ఒత్తిడి లేకుండా ఇలా ఏర్పాటు చేశారని అంటారు. అలా ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి ఈ బటన్స్ నిర్మాణం వెనుక.
అలాగే అప్పట్లో మగవారు ఎక్కువగా సైన్యంలో పనిచేసేవారు. సైనికులు ఎక్కువగా ఆయుధాలను కుడి చేతితో వాడుతారు కాబట్టి దుస్తులకు బటన్లు కుడి వైపున నిర్మించడం వల్ల ఎడమ చేతితో అన్బటన్ చేయడం వంటివి సులభంగా చేయవచ్చు. అలా మగవారికి కుడివైపున బటన్స్ ఏర్పాటయ్యాయంటారు.
Chhattisgarh village : పిడుగులు పడకుండా ఆవుపేడ పూత..గ్రామంలో ఇళ్ల గోడలపై వింత డిజైన్లు
అసలు ఇది ఎలా వచ్చింది అన్న విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఫ్యాషన్‌కి అనుగుణంగా కుడి ఎడమైన పర్వాలేదు అనేలా ఉంది నేటి ఫ్యాషన్ డిజైన్ల పద్ధతి. ఇప్పుడు వచ్చే ఫ్యాషన్లను చూస్తుంటే ఇదొక డిజైనా ఇదో కొత్తదనమా అనేలా ఉంటున్నాయి. కానీ క్రియేటివిటీ ఉండాలే గానీ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతీది ఓ సరికొత్త డిజైన్ గా మార్చేయవచ్చనేది నేటి ఫ్యాషన్ స్టైల్..