Shocking Video : అడవిలో వీడియో షూట్, నీటిలో నిలబడిన వ్యక్తిపై పడిన పిడుగు

వన్యప్రాణి నిపుణుడు, జీవశాస్త్రవేత్త అయిన గాలంటే ఓ అడవిలోని వాగులో మోకాలి లోతు నీటిలో నిలబడి వీడియో తీస్తుండగా పిడుగు పడింది.

Forrest Galante Video Captures Lightning : అమెరికాకు చెంది 35 ఏళ్ల ఫారెస్ట్ గాలంటేకు సాహసాలు చేయటమంటే అతనికి చాలా ఇష్టం. వన్యప్రాణులు అంటే అంతకంటే ఇష్టం. వన్యప్రాణి జీవశాస్త్ర రంగంలో పని చేస్తు వన్యప్రాణుల గురించి వాటి సంరక్షణ గురించి ఎన్నో విషయాలు వివరిస్తుంటారు. దాని కోసం దట్టమైన అడవుల్లో సంచరిస్తుంటారు. ఎన్నో విషయాలు తెలియజేస్తు వీడియోలు తీస్తుంటారు. వాటిని తన యూట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేస్తుంటారు.

వన్యప్రాణి నిపుణుడు, జీవశాస్త్రవేత్త అయిన గాలంటే ఓ అడవిలోని వాగులో మోకాలి లోతు నీటిలో నిలబడి వీడియో తీస్తుండగా పిడుగు పడింది. అది వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. గాలంటే ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ సిటీలో చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Elephant Toothpaste’ : లైవ్‌లో బెడిసికొట్టిన యూట్యూబర్ ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం.. ఆస్పత్రిపాలైన గేమర్

గాలంటే సౌత్ ఫ్లోరిడాలో తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోను షూట్ చేస్తున్నారు. అడవిలోని ఓ నీటిలో నిలుచుని మాట్లాడుతూ ‘మాకు అద్భుతమైన షాట్‌లు వస్తున్నాయి. ఇది అందమైన రోజు. ఇక్కడి నీరు నిలకడగా ఉంది. షూటింగ్‌ అద్భుతంగా జరుగుతోంది. ఇక షూటింగ్‌ చివరి దశలో ఉంది. వర్షం పడడం మొదలవుతోంది. ఇది ఫ్లోరిడా. ఇక్కడ తరచూ వర్షాలు కురుస్తుంటాయి. అన్ని వేళలా మెరుపులు, ఉరుములు కనిపిస్తాయి’ అని చక్కగా వివరిస్తున్నారు. ఇంతలో అతని పక్కనే పిడుగుపడింది. ఆ ధాటికి అతను నీటిలోకి కొద్దిగా తొట్రుపడ్డారు.

ఈ ఘటన తర్వాత కొన్ని క్షణాలకు కోలుకుని తిరిగి వివరించటం మొదలుపెట్టారు. అలా మాట్లాడుతూ ‘ఆ సమయంలో కాంతిని చూడలేకపోయాను. ఆకస్మిక పిడుగు దాడితో నా మైండ్‌ బ్లాంక్ అయిపోయింది. విపరీతమైన వెలుగు రావడంతో కాసేపు ఏమీ చూడలేకపోయాను. కానీ లక్కీగా నాకు నా టీమ్ కు పెద్దగా ఏమీ కాలేదు. నాకు శరీరమంతా నొప్పిగా ఉంది. గొంతు ఎండిపోయినట్లుందని’ అంటూ వివరించారు గాలంటే.

ట్రెండింగ్ వార్తలు