Elephant Toothpaste’ : లైవ్‌లో బెడిసికొట్టిన యూట్యూబర్ ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం.. ఆస్పత్రిపాలైన గేమర్

లైవ్ వీడియో చేసే సమయంలో పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటారు. ఓ యూట్యూబర్ చేసిన ఓ ప్రయోగం బెడిసి కొట్టి దాదాపు అదే పరిస్థితి వచ్చేలా చేసింది.

Elephant Toothpaste’ : లైవ్‌లో బెడిసికొట్టిన యూట్యూబర్ ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం.. ఆస్పత్రిపాలైన గేమర్

YouTuber 'Elephant Toothpaste' Experiment

YouTuber Elephant Toothpaste’ Experiment : యూట్యూబర్స్ రకరకాల వీడియోలు చేస్తు క్రేజ్ క్రియేట్ చేసుకుంటుంటారు. పేరు, డబ్బు కూడా సంపాదిస్తుంటారు.దీని కోసం రిస్కీ వీడియోలు కూడా చేస్తుంటారు. పేరు కోసం ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్బాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరీ ముఖ్యంగా లైవ్ వీడియో చేసే సమయంలో పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటారు. ఓ యూట్యూబర్ చేసిన ఓ ప్రయోగం బెడిసి కొట్టి దాదాపు అదే పరిస్థితి వచ్చేలా చేసింది. IShowSpeed పేరుతో ఫేమస్ అయిన 18 ఏళ్ల ఈ యూట్యూబర్ లైవ్ లో ఓ ప్రయోగం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. తన బెడ్ రూమ్ లో లైవ్ వీడియో చేసే సమయంలో ‘ఎలిఫెంట్ టూత్ పేస్ట్’ ప్రయోగం చేశాడు.

ఎలిఫెంట్ టూత్ పేస్ట్ ప్రయోగం అంటే ఏంటి…?
ఎలిఫెంట్ టూత్ పేస్ట్ ప్రయోగం ప్రక్రియ శాస్త్రీయమైనది. హెడ్రోజన్ పెరాక్సైడ్,డ్రై ఈస్ట్, డిష్ సోప్ కలవగానే ఒక రకమైన నురుగు వస్తుంది. అది ఓ రేంజ్ లో పెరుగుతుంది. ఓ రేంజ్ లో నురుగు క్రియేట్ చేయటాన్ని ఎలిఫెంట్ టూత్ పేస్ట్ ప్రయోగం అని పిలుస్తున్నారు. జంబో రేంజ్ లో టూత్ పేస్ట్ లాంటి నురుగు పదార్ధాన్ని తయారు చేయటం అన్నమాట.

ఇటువంటి ప్రయోగాలు ఒకోసారి వికటించవచ్చు. ఆ సమయంలో నురుగుతో పాటు ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ అయి ఊపిరి తీసుకోవటం కష్టమైపోతుంది. అది మనం తట్టుకోలేనంతగా రిలీజ్ అవుతాయి. అటువంటి సమయంలో ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. మోతాదుకు మించి ఆక్సిజన్ రిలీజ్ అయితే మనిషి ఉక్కిరి బిక్కిరి అపోతారు. ఊపిరి తీసుకోవటం కష్టమైపోతుంది.ఆ సమయంలో ప్రాణాలు పోవచ్చు కూడా.

ఈ యూటూబర్ ప్రయోగం చేసే క్రమంలో జరిగింది కూడా అదే. లైవ్ లో ‘ఎలిఫెంట్ టూత్ పేస్ట్’ ప్రయోగం చేసే క్రమంలో నురుగలు భారీ స్థాయిలో పొంగింది. పొగలా వచ్చి క్షణాల్లో రూమ్ అంతా కమ్మేసింది. ఓ మగ్ లో ఈ ప్రక్రియను ఓ వ్యక్తి చేస్తుంటే యూటూబర్ వివరిస్తున్నాడు. అదే సమయంలో వారు అనుకున్నదానికంటే ఓ రేంజ్ లో నురుగు మగ్ పైకి వచ్చేసింది. పొంగిపోయి మగ్ లోంచి పొంగి టేబుల్ నిండిపోయి కిందకి జారిపోయింది. ఆ సమయంలో పొగ దట్టంగా కమ్మేసింది. దీంతో యూటూర్ ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. అప్పటికీ ఇంకా ప్రయోగం గురించి వివరిస్తునే ఉన్నాడు. అప్పటికే అతను ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నాడని వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. పరిస్థితి విషమిస్తోందని గుర్తించిన కెమెరామెన్ అతడిని బయటకు తీసుకెళ్లిపోయాడు. తరువాత అతనికి చికిత్స అందించటంతో ప్రమాదం తప్పింది.