Kashmiri Girl Selfie video To Modi
Kashmiri girl Selfie video to PM Modi : ‘మా స్కూలు ఎంత చెత్తగా ఉందో చూడండి మోదీజీ’ సెల్ఫీ వీడియో తీసి ప్రధాని మోదీకి పంపించింది కశ్మీర్ కు చెందిన ఓ బాలిక. ఈ వీడియోలో బాలిక స్కూల్ యూనిఫాం వేసుకుని ఉంది. వీడియోలో బాలిక ప్రధాని మోదీని ఉద్ధేశిస్తు..మోదీజీ! మీకో విషయం చెప్పాలి. మా స్కూలు ఎలా ఉందో చూడండి..స్కూల్లో బెంచీలు లేక నేల మీదే కూర్చొంటున్నాం. దీంతో మా యూనిఫామ్‌లకు దుమ్ము అంటుకొని మాసిపోతున్నాయి. రోజూ అమ్మావాళ్లు తిడుతున్నారు. టాయిలెట్ మరీ ఘోరంగా ఉంది. ఐదేళ్లుగా మా స్కూల్ భవనం ఇలేగే ఉంది.. మోదీజీ! మీరు దేశం మొత్తం మాట వింటారు కదా.. నా మాట కూడా వినండి ప్లీజ్. మాకో మంచి స్కూలు కట్టించండి’’ అని సీరత్ అనే బాలిక తన సెల్ఫీ వీడియోలు ప్రధానిని తన ముద్దు ముద్దు మాటలతో కోరింది.
Rahul Gandhi: బంగ్లా ఖాళీ చేసిన రాహుల్.. ట్రక్కుల్లో ఫర్నిచర్ తరలింపు
జమ్మూకశ్మీర్‌కు చెందిన ‘మార్మిక్ న్యూస్’ అనే మీడియా సంస్థ బాలిక సెల్ఫీ వీడియోను ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 20 లక్షల మంది చూశారు. 1,16,000లైకులు వచ్చాయి. వీడియోను ఈ పాప నేను ఈ స్కూల్ విద్యార్ధినిని అంటూ పరిచయం చేసుకుంటు మోదీకి విన్నపం చేయటం ప్రారంభించింది. సీరత్ నాజ్ కథువా జిల్లా లొహై-మల్హార్ గ్రామానికి చెందిన బాలిక. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. “మోదీ-జీ, ముఝే నా ఆప్ సే ఏక్ బాత్ కెహ్నీ హైన్ అంటూ చక్కటి భాషలో ముద్దు ముద్దుగా ఉన్న సమస్యలను చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పింది.ఎటువంటి తడబాటు లేకుండా ప్రధానిని ఉద్దేశించి చేసిన అభ్యర్థనను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Uttar Pradesh : మున్సిపల్ సీటు కోసం 45 గంటల్లోనే పెళ్లి ఫిక్స్ చేసుకున్న 45 ఏళ్ల కాంగ్రెస్ నేత