Rahul Gandhi: బంగ్లా ఖాళీ చేసిన రాహుల్.. ట్రక్కుల్లో ఫర్నిచర్ తరలింపు

ఎంపీగా అనర్హత వేటు తరువాత రాహుల్ గాంధీ అధికారిక నివాసాన్ని నెల రోజుల్లో ఖాళీ చేయాలని మార్చి 27న రాహుల్ గాంధీకి హౌసింగ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ 2004 నుంచి 12 తుగ్లక్ లేన్ నివాసంలో ఉంటున్నారు.

Rahul Gandhi: బంగ్లా ఖాళీ చేసిన రాహుల్.. ట్రక్కుల్లో ఫర్నిచర్ తరలింపు

Rahul Gandhi

Updated On : April 14, 2023 / 7:08 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ప్రధాని మోదీ ఇంటి పేరు విషయంలో గతంలో రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేయగా, దీంతో పరువు నష్టం కేసులో ట్రయల్స్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడడంతో లోక్ సభ సభ్యత్వంపై కూడా వేటుపడింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.

ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ బంగ్లా నుంచి ఫర్నిచర్ ను ట్రక్కుల్లో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసం 10 జన్ పథ్ కు తరలించారు. ఎంపీగా అనర్హత వేటు తరువాత రాహుల్ గాంధీ అధికారిక నివాసాన్ని నెల రోజుల్లో ఖాళీ చేయాలని మార్చి 27న రాహుల్ గాంధీకి హౌసింగ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ 2004 నుంచి 12 తుగ్లక్ లేన్ నివాసంలో ఉంటున్నారు.

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని గుజరాత్ సూరత్ లోని ట్రయల్స్ కోర్టు దోషిగా తేల్చడంతో, ఆ కోర్టు ఇచ్చిన తీర్పును సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ అప్పీలు చేశారు. ఆ తీర్పుపై సెషన్స్ కోర్టు మధ్యంతర స్టే ఇవ్వలేదు. రాహుల్ పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ కు స్టే ఇవ్వకూడదంటూ కోర్టులో పూర్ణేశ్ మోదీ ఇటీవలే పిటిషన్ వేశారు.

Delhi liquor scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్.. లిక్కర్ స్కాంలో సీబీఐ నోటీసులు