Lord Vishnu On 1000 Years Tree : 1000 ఏళ్ల నాటి చెట్టులో అనంత శేషశయన రూపంలో కొలువైన శ్రీ మహావిష్ణువు

ఓ టేకు చెట్టులో శ్రీ మహా విష్ణువు కొలువయ్యాడు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ టేకు చెట్టులో శ్రీ మహా విష్ణువు అనంత శయన రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ అరుపూప దృశ్యానికి హైదరాబాద్ వేదికగా నిలిచింది.

Lord Maha Vishnu Idol

Lord Vishnu On 1000 Years tree In Hyderabad : వెయ్యేళ్ల చరిత్ర.. మరో వెయ్యేళ్లు వర్ధిల్లే అపురూప కళా ఖండానికి హైదరాబాద్‌ వేదిక అయింది. చూసేందుకు రెండు కళ్లు సరిపోవన్నంతగా రూపు దిద్దుకున్న ఆ కళా ఖండం శ్రీ మహా విష్ణువు ప్రతిరూపంగా మారింది. అనంత శేషశయన విష్ణువుగా దర్శినమిస్తున్న అద్భుత కళా ఖండాన్ని ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి తీర్చిదిద్దారు. బర్మా నుంచి మన హైదరాబాద్‌కు తీసుకువచ్చిన టేకు దుంగ మహా కళా ఖండంగా ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకుందాం..

హైదరాబాద్‌లోని అనురాధ టింబర్‌ డిపో యజమానులు టేకు దుంగల వ్యాపారం చేస్తుంటారు. విదేశాల నుంచి టేకు దుంగలను తెప్పించి విక్రయించడం వారి వ్యాపారం. ఈ క్రమంలోనే వెయ్యేళ్ల నాటి బర్మా టేకు వారి దృష్టిలో పడింది. కోట్ల రూపాయల విలువ చేసిన ఈ భారీ టేకు కలపను వారు విక్రయించాలని వారు కోరుకోలేదు. మంచి లాభం సంపాదించే అవకాశం ఉన్నా.. విలువైన ఆ టేకు దుంగకు అంతే విలువ జోడించాలని భావించి దేవుడి విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించారు.

21 అడుగుల పొడవు, ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు.. 20 అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ టేకు దుంగ బర్మా నుంచి మన దేశానికి తేవడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. ఆ దేశంతోపాటు మన ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. కోట్ల రూపాయలు ఖర్చు. అయినా ఏమాత్రం వెనుకాడలేదు అనురాధ టింబర్ డిపో యజమాని చదలవాడ తిరుపతి. ఈ టేకు కలపను కొనుగోలు చేసి శ్రీమహా విష్ణువు రూపాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.దాని కోసం ప్రముఖ చిత్రకారుడు గిరిధర్‌గౌడ్‌తో మాట్లాడి అపురూప చిత్రాన్ని చెక్కించారు.

ఈ కళా ఖండం తయారీకి సుమారు ఐదేళ్లు పట్టింది. బర్మాలోనే మొత్తం కళా ఖండాన్ని చెక్కించి ఓ రూపం వచ్చాక హైదరాబాద్‌ తీసుకువచ్చారు. ఇక్కడ తుది మెరుగులు అద్ది ప్రజల దర్శనం కోసం ఉంచారు. ఈ అరుదైన కళా ఖండాన్ని ఈ నెల 1న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. లాభాపేక్ష లేకుండా మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు తెలియజేసిన వ్యాపారులను వెంకయ్యానాయుడు అభినందించారు.

వెయ్యేళ్ల నాటి టేకు అంటే ఎంతో చేవ ఉంటుంది. ఉక్కు కూడా సరిపోనంత గట్టిదనం ఉంటుంది. అందుకే ఇంతటి ప్రత్యేకమైన.. అపురూపమైన కలపను సాదాసీదాగా వదిలేయకూడదనుకున్నారు భాగ్యలక్ష్మి టింబర్ డిపో యజమానులు. తమ ఇష్టదైవమైన మహా విష్ణువు విగ్రహాన్ని చెక్కించాలని నిర్ణయించుకుని వేలంలో దక్కించుకున్నారు. ఈ అపురూప కళా ఖండం మరో వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరదని చెబుతున్నారు.

ఎంతో విలువైన టేకు దుంగపై మహా విష్ణువు ప్రతిరూపాన్ని ప్రతిష్టించాలని కోరుకుంటే సరిపోతుందా? అదో యజ్ఞమే.. ఆ యజ్ఞాన్ని పూర్తి చేసే బాధ్యత సరైన వ్యక్తికే అప్పగించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లక్ష్యం చెదిరిపోతుంది. విలువైన టేకు వృథా అవుతుంది. అందుకే ఈ బాధ్యతను గిరిధర్‌ గౌడ్‌కు అప్పగించారు. సుమారు నాలుగేళ్లపాటు కష్టించి ఆయన ఈ అపురూత చిత్రానికి ప్రాణం పోశారు.

భగవత్గీతలోని అనంత శేషశయన విష్ణువు రూపాన్ని చెక్కించాలనే నిర్ణయం తీసుకుని అత్యంత జాగ్రత్తగా.. నిష్టతో తయారు చేశారు. చక్కతో తయారుచేసిన ఇలాంటి దేవుడి బొమ్మ దేశంలో మరెక్కడా ఉండే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే వెయ్యేళ్ల నాటి కలప లభించడమే అరుదైన విషయం.. ఈ అరుదైన కలపుకు అంతకుమించిన గొప్పదనాన్ని జోడించడం విశేషం. అయితే ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ప్రత్యేకించి ఓ స్థలాన్ని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం బోయినపల్లిలోని అనురాధ టింబర్‌ డిపో ప్రాంగణంలోనే ఉంచారు. కాగా..బర్మాలోని టేకు చెట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. బర్మా టేకు మంచి ప్రసిద్ధి చెందిన టేకుగా పేరుంది.

 

Hyderabad Anuradha timbers Owner made Lord Vishnu Idol ON 1000 Years tree