నడిరోడ్డుపై ఇలా కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నావేంటీ? ఇంతకూ ఏ కంపెనీలో పనిచేస్తున్నావ్?

Viral Pic: ఓ డెలివరీ బాయ్ మాత్రం బ్యాగు ఓ కంపెనీది, టీషర్ట్ మరో కంపెనీ వేసుకుని ఫుడ్ డెలివరీకి వెళ్లాడు.

ఎండ, వాన, చలి అనే తేడాలే లేకుండా ఫుడ్ డెలివరీ బాయ్స్ కస్టమర్లకు ఆహారం అందిస్తుంటారు. మారిన జీవనశైలి కారణంగా చాలా మంది ఇంట్లోనే కూర్చొని ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నో ఫుడ్ డెలివరీ యాప్‌లు పుట్టుకొచ్చాయి. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ గురించి తెలియని వారే లేరు.

రోడ్డుపైకొచ్చి చూస్తే చాలా మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ తమ కంపెనీలకు సంబంధించిన యూనిఫాం వేసుకుని బైకులపై వెళ్తూ కనపడుతుంటారు. ఏ కంపెనీలో పనిచేస్తే అదే కంపెనీ బ్యాగ్, టీషర్ట్ వేసుకుంటారు. అయితే, ఓ డెలివరీ బాయ్ మాత్రం బ్యాగు ఓ కంపెనీది, టీషర్ట్ మరో కంపెనీ వేసుకుని ఫుడ్ డెలివరీకి వెళ్లాడు.

అంతేగాక, అతడి హెల్మెట్‌పై విద్యుత్ వాహనాల రెంట్ సర్వీస్ కంపెనీ జిప్ లోగో ఉంది. రోడ్డుపై అతడిని చూసిన ఓ నెటిజన్ వీడియో తీసి పోస్ట్ చేయడంతో ఇది తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ డెలివరీ బాయ్ ఏ కంపెనీలో పనిచేస్తున్నాడని నెటిజన్లు తికమక పడుతున్నారు.

స్విగ్గీ యూనిఫాం వేసుకుని, జొమాటో ఫుడ్ ను ఎలా డెలివరీ చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. రెండు కంపెనీల్లోనూ పనిచేస్తున్నాడేమోనంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ నీదే కంపెనీ? ఊహించని చిత్ర విచిత్రం.. నడిరోడ్డుపై ఇలా కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నావేంటీ? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read : పుష్ప అంటే ఆ మాత్రం క్రేజ్ సాధారణమే.. సురేష్ రైనా ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

ట్రెండింగ్ వార్తలు