Karnataka : రియల్ శుభలగ్నం సినిమా .. భర్తను అమ్మేసిన భార్య, ధర ఎంతో తెలుసా..?!

‘శుభలగ్నం’ సినిమాను తలపించేలా ఓ రియల్ స్టోరీ జరిగింది. తన భర్తను అతని ప్రియురాలికే అమ్మేసింది భార్య. ఈ రియల్ శుభలగ్నం స్టోరీలో ట్విస్టులే ట్విస్టులు,,

wife who sold her husband

Karnataka women sells her husband : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘శుభలగ్నం’ సినిమాను తలపించేలా ఓ రియల్ స్టోరీ జరిగింది కర్ణాటకలో. జగపతి బాబు, ఆమని, రోజా నటించిన శుభలగ్నం సినిమాను మించిన ట్విస్టులున్నాయి ఈ రియల్ శుభలగ్నం స్టోరీలో. ఆ సినిమాలో ఆమని డబ్బుమీదున్న వ్యామోహంతో తన భర్త జగపతి బాబును రోజాకు అమ్మేస్తే..కర్ణాటకలోని మాండ్యకు సమీపంలోని ఓ గ్రామంలో మాత్రం ఓ మహిళ తన భర్త ప్రియురాలికే అమ్మేసింది. ‘నీ భర్తను వదిలి నేను ఉండలేను’ అంటూ ప్రియురాలు ఏడ్చింది. దీంతో సదరు భార్య ఆమెకే తన భర్తను రూ.5లక్షలకు అమ్మేసింది.

ఈ రియల్ శుభలగ్నంలో మరిన్ని ట్విస్టులున్నాయి. సినిమాలో జగపతి బాబుకు భార్య ఆమని అంటే ప్రాణం. అమ్ముడుపోవటానికి ఇష్టపడలేదు. కానీ పరిస్థితుల ప్రభావంతో మొదటి భార్య ఆమని డబ్బు వ్యామోహంతో రకరకాల పోకడలకు పోతు తనను పట్టించుకోకపోవటంతో రోజాకు దగ్గరవుతాడు. కానీ ఈ రియల్ స్టోరీలో మాత్రం భర్త మాత్రం జగపతిబాబులాంటివాడు కాదు. ఓ మహిళతు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన భార్య భర్తను పదే పదే హెచ్చరించింది. కానీ భర్త వినలేదు. ప్రియురాలితో గడపటం మానలేదు. దీంతో భార్యకు ఒళ్లు మండింది. ఓరోజు భర్తను..ప్రియురాలితో అత్యంత సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

Kerala High Court : మహిళలు తమ అమ్మ,అత్తగార్లకు బానిసలు కాదు : జడ్జి కీలక వ్యాఖ్యలు

గ్రామంలోని పెద్దల మధ్య పంచాయతీ పెట్టింది. భర్తను, ప్రియురాలిని నలుగురిలో నిలబెట్టింది. తన భర్త ప్రియురాలితో ఉంటు తనను..తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని..అస్సలు ఇంటికే రావటంలేదని ఎంతగా చెప్పినా బుద్ది మార్చుకోవటంలేదంటూ కన్నీరు పెట్టుకుంది. ఆ విషయాన్ని పంచాయతీ పెద్దలు సదరు భర్తను..అతని ప్రియురాలిని వివరణ అడిగారు. దానికి ప్రియురాలు మాట్లాడుతు..అతను అంటే తనకు చాలా ఇష్టమని..అతనికి కూడా తనంటే ఇష్టమని తమకు విడదీయొద్దని అతను లేకుండా తాను జీవించలేనని చెప్పింది. దాంతో పెద్దలు అలాగైతే ఎలాగా…? అతనికి విహామైంది కుటుంబం ఉంది..అలా ఎలా కుదురుతుంది..? అని ప్రశ్నించారు.

దానికి ఆమె అతనిని తాను వదలాలంటే అతను తనకు రూ.5లక్షలు బాకీ ఉన్నడని అవి ఇచ్చేస్తే వదిలేస్తానని చెప్పింది. దానికి పంచాయతీ పెద్దలు షాక్ అయ్యారు. దానికి నువ్వేమంటావమ్మా.. అంటూ భార్యను అడిగారు. దానికి ఆమె ‘‘డబ్బులు కట్టి భర్తను విడిపించుకోవటమేంటీ..? తీరా డబ్బులు చెల్లించాక తిరిగి ఆమె వద్దకే తన భర్త వెళితే తన గతి ఏంటీ అంటూ ప్రశ్నిస్తు ఇటువంటి భర్త తనకు వద్దని తనకే రూ.5 లక్షలు మనోవర్తి కింద ఇస్తే భర్తను ఆమెకు వదిలేసేందుకు సిద్ధం‘‘అని చెప్పింది. ఊహించని ఈ సమాధానికి పంచాయతీ పెద్దలు సైతం షాక్ అయ్యారు. కానీ ఈ షరతుకి ప్రియురాలు కూడా అంగీకరించటంతో భర్త ప్రియురాలికి బదిలీ ప్రక్రియను పూర్తి చేశారు పెద్దలు. వారి మధ్య కుదిరిన ఒప్పందం చూసి గ్రామపెద్దలే కాదు గ్రామస్థులు,వారి బంధువులు కూడా ఆశ్చర్యపోయారు.