Viral Video: ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైకుపై పాల క్యాన్లు పెట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ పాలు పోస్తున్న వ్యక్తి

ఖరీదైన బైకు కొంటే దాన్ని బంగారంలా చూసుకుంటారు. దానిపై చిన్న గీత కూడా పడనివ్వరు. ఏవైనా వస్తువులు దానిపై పెట్టుకుని తీసుకెళ్లాలంటే చాలా మంది ఒప్పుకోరు. అయితే, ఓ వ్యక్తి ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైకుపై పాల క్యాన్లు పెట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ పాలు పోస్తున్నాడు. పాలు పోయడానికి ఇంత ఖరీదైన బైకు ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Viral Video

Viral Video: ఖరీదైన బైకు కొంటే దాన్ని బంగారంలా చూసుకుంటారు. దానిపై చిన్న గీత కూడా పడనివ్వరు. ఏవైనా వస్తువులు దానిపై పెట్టుకుని తీసుకెళ్లాలంటే చాలా మంది ఒప్పుకోరు. అయితే, ఓ వ్యక్తి ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైకుపై పాల క్యాన్లు పెట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ పాలు పోస్తున్నాడు. పాలు పోయడానికి ఇంత ఖరీదైన బైకు ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఆ వ్యక్తి హార్లీ డేవిడ్సన్ బైకుపై పాలు తీసుకు వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమిత్ భందానా అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనూ లక్షలాది వ్యూస్ వచ్చాయి. సాధారణంగా పాలు పోయడానికి స్కూటర్ లేదా ఇతర బైకులను వాడుతుంటారు.

పాలక్యాన్లు పెట్టుకుని తీసుకెళ్లడానికి కొందరు ఆర్డర్లు ఇచ్చి మరీ ప్రత్యేకంగా స్కూటర్లు తయారు చేయించుకుంటారు. కొందరు సైకిళ్లపై వెళ్లి కూడా పాలు పోస్తుంటారు. అయితే, హార్లీ డేవిడ్సన్ వంటి ఖరీదైన బైకు కొనుక్కుని దానిపై పాల క్యాన్లు పెట్టుకుని వెళ్లడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లిళ్లకు, విందులకు వెళ్లాలంటే స్నేహితులు, బంధువుల వద్ద నుంచి హార్లీ డేవిడ్సన్ వంటి బైకులు తీసుకుని కొందరు వెళ్తుంటారు. ఈ వ్యక్తి మాత్రం అన్నింటికీ ఇంతటి ఖరీదైన బైకును వాడడం చాలా విచిత్రంగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

Texas twin girls: కవల పిల్లలు పుట్టారు.. కానీ, వేర్వేరు తేదీలు, సంవత్సరాల్లో…