Mystery Well : 20ఏళ్లుగా ఎండిపోయిన బావిలోంచి పొంగుతున్న వేడినీరు,వ్యాధులు నయమవుతున్నాయని ప్రచారం,స్నానాల కోసం ఎగబడుతున్న జనాలు

అది 70 ఏళ్ల క్రితం వ్యవసాయం కోసం తవ్విన బావి. 20 ఏళ్లుగా ఎండిపోయింది. చక్క నీరు కూడా లేకుండా ఎండిపోయింది. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆ బావిలోంచి వేడినీరు పొంగుతోంది. ఆ నీటితో స్నానం చేస్తే వ్యాధులు నయమవుతున్నాయని కొంతమంది చెబుతున్నారు. దీంతో ఆ బావి నీటిలో స్నానం చేయటానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.

Bihar Mystery well Boiling water

Bihar Mystery well Boiling water : బీహార్‌లో ఓ వింత చోటుచేసుకుంది. 20 ఏళ్లుగా ఎండిపోయిన బావిలోంచి నీరు పెల్లుబికి పొంగుతోంది. ఇదో పెద్ద వింతా..? అనుకోవచ్చు. కానీ ఆ నీరు వేడిగా సలసలా కాగిపోతోంది. పొగలు కక్కుతు పొంగుతోంది. దీంతో ఈ వింత చూడటానికి జనాలు తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. భాగల్ పూర్ లోని ఓ బావిలోంచి నీరు కుతకుత ఉడుకుతున్నట్లుగా ఉంటంతో ఆ ప్రాంతం చుట్టు పక్కల నుంచి జనాలు భారీగా తరలి వచ్చి చూస్తున్నారు.

లోని భాగల్‌పూర్‌ జిల్లాలోని గోరాబీప్ పరిధిలోని హర్చండీలోని బదరీ బహరియాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. బదరీ బహరియా మెట్ల బావి చర్చనీయాంశంగా మారింది. ఈ బావి గత 20 ఏళ్లుగా పూర్తిగా ఎండిపోయివుంది. 70 ఏళ్ల క్రితం ఓ వ్యవసాయ పొంలంలో నిర్మించిన ఈ బావి 20 ఏ్ళలుగా పూర్తిగా ఎండిపోయింది. కానీ ఈ బావిలోంచి వేడి నీరు పొంగుతుండటంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ నీరు చూడటానికి కుత కుత ఉడుకుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ పట్టుకుని చూస్తే మాత్రం చల్లగానే ఉంటం విశేషంగా మారింది.

Minister Chandra Shekhar : రాముడు నా కలలోకి వచ్చి తనను బజార్లో అమ్మొద్దని చెప్పాడు : మంత్రి వ్యాఖ్యలు

ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడు మెట్ల ద్వారా బావిలోనికి వెళ్లి చూశాడు. నీరు బావికి ఒక స్థాయికి వచ్చి ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆ యువకుడు ఊర్లో అందరికి చెప్పగా ఈ వింత ఆ నోటా ఈ నోటా ఆ చుట్టుపక్కల అంతా తెలిసింది. దీంతో జనాలు తరలి వచ్చి ఆ వింతను చూస్తున్నారు. దాదాపు 80 అడుగుల లోతు ఉండే ఈ బావిలో పొంగిన నీరు 25 అడుగుల పైకి పొంగి అక్కడే ఆగిపోయింది.

ఈ విషయం తెలిసిన అదే గ్రామానికి చెందిన ఓ ప్రొఫెసర్‌ ఈ నీటిని డీటీఎస్‌ పరీక్షలకు పంపారు. ఈ నీరు తాగటానికి పనికిరాదని తేల్చి చెప్పారు. వేడి నీరు పొంగుతోందని తెలిసిన కొంతమంది కుర్రాళ్లు ఈ బావి వద్దకు స్నానాలు చేయటానికి ఉత్సాహంగా వస్తున్నారు. ఇంతకంటే మరో విచిత్రం ఏమిటంటే ఈ నీటితో స్నానం చేశానని తనకు అంతకు ముందున్న చర్మ రోగాలన్నీ తగ్గిపోయాయని తెలిపింది సునైనాదేవి అనే ఓ మహిళ. దీంతో ఆమె చెప్పేది నిజమో కాదో తెలియదు గానీ ఆ మాటల్ని నమ్మిన చాలామంది ఈ బావిలోని నీటితో స్నానం చేస్తున్నారు.