Minister Chandra Shekhar : రాముడు నా కలలోకి వచ్చి తనను బజార్లో అమ్మొద్దని చెప్పాడు : మంత్రి వ్యాఖ్యలు
‘‘రాముడు శబరి ఎంగిలి చేసిన పండ్లను తిన్నాడు. కానీ శబరి కుమారులను దేవాలయాల్లోకి వెళ్లేందుకు నిషేధించారు. ఇది చాలా విచారకరం.

Minister Chandra Shekha
Minister Chandra Shekhar Lord Sri Rama : రామచరిత మానసను మంత్రి ఇటీవల పొటాషియం సైనేడ్‌తో పోల్చిన బీహార్ విద్యాశాఖ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచరితమానస్లో పొటాషియం సైనైడ్ ఉంది అంటూ రాష్ట్రీయ జనతా దళ్ నేత, బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ తాజాగా శ్రీరాముడి గురించి వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు తన కలలోకి వచ్చి…తనను మార్కెట్ లో అమ్మేస్తున్నారని..అలా అమ్మకుండా తనను కాపాడు అంటూ రాముడు చెప్పాడు అంటూ వ్యాఖ్యానించారు.
బీహార్ లోని రామాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి చంద్రశేఖర్ ప్రసంగిస్తు..తనకు రాముడు కలలో కనిపించాడని..తనను మార్కెట్ (బజార్)లో అమ్మేస్తున్నారు..అలా అమ్మకుండా తనను కాపాడాలి అని కోరాడు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే దేశంలో కుల వ్యవస్థ గురించి ఆయన మాట్లాడుతు..‘‘రాముడు శబరి ఎంగిలి చేసిన పండ్లను తిన్నాడు. కానీ ఈరోజు మాత్రం శబరి కుమారులను దేవాలయాల్లోకి వెళ్లేందుకు నిషేధించారు. ఇది చాలా విచారకరం. రాష్ట్రపతి, సీఎంలను కూడా ఆలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు..ఆలయాలను గంగా జలంతో శుద్ధి చేస్తున్నారు..శబరి ఎంగిలి చేసిన పండ్లను తిన్న దేవుడే స్వీకరించాడు. ఆయన కూడా కులవ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Ramcharitmanas: రామచరితమానస్లో పొటాషియం సైనైడ్.. మరోసారి దుమారం లేపిన బిహార్ విద్యా మంత్రి
మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. దీనిపై సొంతపార్టీ జేడీయూ స్పందిస్తు.. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. కాగా గత కొన్ని రోజుల క్రితం మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతు..రామచరితమానస్ విధ్వేషాలు రెచ్చగొడుతుందని..రామచరితమానస్లో పొటాషియం సైనైడ్ ఉంది అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది.