AliExpress : పేరుకే ఎక్స్‌ప్రెస్ .. ఆర్డర్ ఇచ్చిన నాలుగేళ్లకు వచ్చిన పార్శిల్ .. ఆశ కోల్పోవద్దు అంటూ సూచన

‘ఎప్పటికీ ఆశ కోల్పోవద్దు..మనం ఆశించింది లేట్ అయినా దక్కుతుంది. లేట్ అయినా వస్తుంది..కాబట్టి ఆశను కోల్పోవద్దు..నాలుగేళ్లుగా అతను చూసిన ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు అనుకున్నది చేతికొచ్చింది.

AliExpress Delhi man Nitin Agarwal

AliExpress  : రైలు జీవిత కాలం లేటు అన్నట్లుగా ఓ పార్శిల్ ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు వచ్చింది. ఢిల్లీ (Delhi)కి చెందిన టెక్కీ నితిన్ అగర్వాల్ (Nitin Agarwal )అనే వ్యక్తి అలీ ఎక్స్ ప్రెస్ (AliExpress )పోర్టల్ పై బుక్ చేసిన ఆర్డర్ నాలుగేళ్లకు వచ్చింది. చైనా (China)కు చెందిన అలీ ఎక్స్ ప్రెస్ (AliExpress )అనే వెబ్ పోర్టల్ (Web portal)ప్రస్తుతం భారత్ (India)లో నిషేధించిన (band) లిస్టులో ఉంది. దీంతో ఇది పనిచేయటంలేదు. కానీ కొంతకాలం క్రితం వరకు ఇది కొనుగోళ్లకు అందుబాటులోనే ఉంది. చైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా ఉండటంతో భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేశారు.

6 year boy time table : ఆరేళ్ల పిల్లాడి టైమ్ టేబుల్ .. చదవుకోవటానికి టైమ్ ఎంతో తెలిస్తే నవ్వుకోవాల్సిందే..

ఈక్రమంలో ఢిల్లీకి చెందిన నితిన్ అగర్వాల్ అనే వ్యక్తి అలీ ఎక్స్ ప్రెస్ ( AliExpress)పోర్టల్ పై 2019లో అంటే కోవిడ్ (Covid-19)సమయానికంటే ముందే..(2019 అంటే కోవిడ్ కు ముందు కోవిడ్ తరువాత అనేలా మారింది) ఈ పోర్టల్ పై ఆర్డ్ చేశారు. కానీ అది ఎంతకూ రాలేదు. అదికాస్తా నాలుగేళ్లకు డెలివరీ అయ్యిందని నితిన్ అగర్వాల్ వివరించారు. 2019లో అలీ బాబా యాజమాన్యంలోని ఆన్‌లైన్ రిటైల్ సర్వీస్ అయిన అలీఎక్స్‌ప్రెస్ నుండి తాను ఆర్డర్ చేసిన ఉత్పత్తి నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు తనకు డెలివరీ అయిందని ఆయన వెల్లడించారు.

తన అనుభవాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తు ఎవరు ఆశను కోల్పోకూడదని సూచించారు. అలీ ఎక్స్ ప్రెస్ ను మన దేశంలో నిషేధించక ముందు దానిపై ఆర్డర్ చేశానని తెలిపారు. అగర్వాల్ ట్వీట్ చేస్తు ‘ఎప్పటికీ ఆశ కోల్పోవద్దు..నేను 2019లో చేసింది ఇప్పుడొచ్చింది అంటూ పేర్కొన్నారు.

Guinness World Records : 15 గంటలు.. 286 స్టేషన్లు.. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సాధించిన శశాంక్ మను