Guinness World Records : 15 గంటలు.. 286 స్టేషన్లు.. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సాధించిన శశాంక్ మను

మెట్రోలో ఒక గంట ప్రయాణం అంటేనే ఆ రద్దీకి బోర్ కొట్టేస్తుంది. అలాంటిది 15 గంటల ప్రయాణం.. 286 స్టేషన్లు అంటే ఎంత సహనం ఉండాలి. కాదు కాదు ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి శశాంక్ మను అనే వ్యక్తికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించి పెట్టింది.

Guinness World Records : 15 గంటలు.. 286 స్టేషన్లు.. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సాధించిన శశాంక్ మను

Guinness World Records

Guinness World Records : కాదేది కవితకి అనర్హం అంటారు.. ఇప్పుడు కాదేది ప్రపంచ రికార్డ్‌కి అనర్హం అన్నట్లుగా ఉంది. 15 గంటలు కంటిన్యూగా మెట్రోలో ప్రయాణం చేస్తూ 286 స్టేషన్లను కవర్ చేసిన శశాంక్ మను అనే వ్యక్తి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.

Surat Yoga Guinness Record : సూరత్‌లో 1.53 లక్షల మంది యోగా.. సరికొత్త గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌

మెట్రో ప్రయాణం హాయిగా ఉంటుంది. ఎందుకంటే త్వరగా గమ్యస్ధానానికి చేరుకుంటాం.. కానీ ఎక్కిన కొద్దిసేపు ఆ రద్దీని తట్టుకోవడం అంటే చాలా కష్టం. అయితే చాలామందికి మెట్రో తప్పనిసరి ప్రయాణం అయిపోయింది. అయితే శశాంక్ మను అనే ఫ్రీలాన్స్ సైటింస్ట్‌కి ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేసి అత్యథిక సంఖ్యలో స్టేషన్లను సందర్శించి రికార్డు క్రియేట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అమలు చేసేసాడు.

Guinness Record Diamonds Ring : 50 వేల వజ్రాలతో ఉంగరం .. పర్యావరణ సందేశానికి గిన్నిస్‌ రికార్డు

ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మెట్రో లైన్ నెట్ వర్క్‌లలో ఒకటి. 10 లైన్లలో 348.12 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నెట్ వర్క్‌లో అన్ని స్టేషన్లను కవర్ చేయాలంటే చాలా గంటలు సమయం పడుతుంది. మను ఏప్రిల్ 14న 15 గంటల 22 నిముషాల 49 సెకండ్లలో ఈ ఫీట్‌ను ముగించాడు. అయితే గతంలో మెట్రోలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్‌గా ఉన్న ప్రపుల్ సింగ్‌కు పొరపాటున ఈ రికార్డు అందించారు. అయితే దాన్ని గిన్నిస్ యాజమాన్యం సరిచేసుకోవడంతో ఏప్రిల్ నెలలో శశాంక్ మను ఈ రికార్డును అందుకున్నాడు. శశాంక్ మను ఇప్పటికే 70 దేశాలను సందర్శించాడట.