Surat Yoga Guinness Record : సూరత్‌లో 1.53 లక్షల మంది యోగా.. సరికొత్త గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించిన యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డు సాధించింది.

Surat Yoga Guinness Record : సూరత్‌లో 1.53 లక్షల మంది యోగా.. సరికొత్త గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌

Surat Yoga Guinness Record

Gujarat Surat Yoga Guinness Record : అంతర్జాయతీయ యోగా దినోత్సవం (June 21st) సందర్భంగా గుజరాత్ (Gujarat)లోని సూరత్ లో (Surat)లో నిర్వహించిన యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డు (Gujarat World Record)సాధించింది. సూరత్ లోని డుమాస్ ప్రాంతంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో సీఎం భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు. ఈ యోగా కార్యక్రమంలో 1.53 లక్షల మంది యోగా చేశారు. వివిధ ఆసనాలు వేశారు. ఒకేచోట 1.53 లక్షల మంది యోగా చేయటంతో ఇది గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటుసంపాదించింది.

దీంతో సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రాన్ని సంస్థ ప్రతినిధులు అందజేశారు. సూరత్‌లో నిర్వహించే యోగా డే సెషన్‌లో 1.25 లక్షల మంది పాల్గొనేలా చూడాలని సూరత్‌ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ ఊహించినదానికంటే ఎక్కువమందే వచ్చారని 1.50 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. దీంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

Rihanna Diamond watch : చేతికి పెట్టుకునే వాచ్ మెడకు.. నటి రిహన్నా వజ్రాల వాచీ ధర ఎంతో తెలుసా..?!

ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం భూపేంద్ర పటేల్ (Gujarat CM Bhupendra Patel)మాట్లాడుతు..ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) యోగా(Yoga)ను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చారని అన్నారు. కోవిడ్ (Covid-19)మహమ్మారి సమయంలో ఎంతోమంది యోగా చేసి ప్రాణాలు కాపాడుకున్నారని..యోగా,ప్రాణాయామం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి మా ప్రభుత్వం త్వరలో 21 ‘యోగ్ స్టూడియో’లను ప్రారంభించనున్నామని సీఎం ప్రకటించారు. గుజరాత్ (Gujarat)లో రాష్ట్ర యోగా బోర్డు (State Yoga Board)ఇప్పటి వరకు 5 వేల మంది శిక్షకులకు శిక్షణ ఇచ్చిందని..రానున్న రోజుల్లో రాష్ట్రంలో 21 యోగా స్టూడియో( yoga studios)లను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.

ఈ రికార్డుపై హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి (Minister Harsh Sanghavi)మాట్లాడుతు..ఒకేచోట 1.50 లక్షల మందికి పైగా పాల్గొని యోగా చేయటంతో గిన్నిస్‌ రికార్డ్స్‌ నెలకొల్పిందని తెలిపారు. కాగా 2018లో రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన యోగా డే సెషన్‌లో 1,00,984 మంది పాల్గొనడం అప్పట్లో రికార్డు సృష్టించింది. దాన్ని సూరత్ కార్యక్రమం బద్దలు కొట్టి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.

PM Modi’s Gifts To Joe Biden, First Lady: జోబిడెన్ దంపతులకు మోదీ ఏం బహుమతులు ఇచ్చారంటే…