PM Modi’s Gifts To Joe Biden, First Lady: జోబిడెన్ దంపతులకు మోదీ ఏం బహుమతులు ఇచ్చారంటే…

అమెరికా దేశ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ దంపతులకు వినూత్న బహుమతులు ఇచ్చారు.గురువారం వైట్‌హౌస్‌లో మోదీ గౌరవార్థం జో బిడెన్ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు....

PM Modi’s Gifts To Joe Biden, First Lady: జోబిడెన్ దంపతులకు మోదీ ఏం బహుమతులు ఇచ్చారంటే…

PM Modi's Gifts To Joe Biden

PM Modi’s Gifts To Joe Biden, First Lady:అమెరికా దేశ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ దంపతులకు వినూత్న బహుమతులు ఇచ్చారు. గురువారం వైట్‌హౌస్‌లో మోదీ గౌరవార్థం జో బిడెన్ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు. ఈ విందులో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, యూఎస్ భద్రతాధికారి జేక్ సుల్లివన్ పాల్గొన్నారు.(PM Modi US Visit 2023)

US offers Stryker armoured vehicles,guns:భారత్‌కు అమెరికా రక్షణ సహకారం..స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలు,హోవిట్జర్‌, ఎం777 గన్‌లు

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు చేతితో తయారు చేసిన చందనం పెట్టెను, ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు ఆకుపచ్చ వజ్రాన్ని మోదీ అందించారు.(Green Diamond, Sandalwood Box)గంధపు పెట్టెలో వెండి వినాయకుడి విగ్రహం, నూనె దీపాలు ఉన్నాయి. 7.5 క్యారెట్ల వజ్రం పర్యావరణ అనుకూలమైనది. ఈ వజ్రాన్ని కాగితం గుజ్జుతో చేసిన పెట్టెలో పెట్టి బహుమతిగా ఇచ్చారు.

PM Modi meets Joe Biden: వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో మోదీ సమావేశం

బిడెన్స్ నుంచి హ్యాండ్‌మేడ్, పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని ప్రధాని మోదీ అందుకున్నారు.పాతకాలపు అమెరికన్ కెమెరా, అమెరికన్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన హార్డ్‌కవర్ పుస్తకాన్ని బిడెన్ దంపతులు మోదీకి అందజేశారు.మోదీ అమెరికా దేశ పర్యటన రెండు దేశాల మధ్య పలు రంగాల్లో సంబంధాలను బలోపేతం చేయనుంది. భారత హస్తకళాకారులు తయారు చేసిన పలు అరుదైన బహుమతులను మోదీ బిడెన్ కు అందజేశారు.  తమిళనాడు తెల్ల నువ్వులు, రాజస్థాన్ హిరణ్యదాన్ బంగారు నాణెం, పంజాబ్ నుంచి సేకరించిన వెన్న, నెయ్యి, జార్ఖండ్ నుంచి తెప్పించిన వస్త్రదాన్, మహారాష్ట్ర నుంచి బెల్లం, వెండి నాణెం, గుజరాత్ ఉప్పు, కర్ణాటక మైసూర్ నుంచి రప్పించిన గంధపు ముక్క, బెంగాల్ కళాకారులు తయారు చేసిన వెండి కొబ్బరికాయ,యూపీ తామ్రపత్రాలను మోదీ జోబిడెన్ దంపతులకు మోదీ బహుమతిగా అందించారు.