US offers Stryker armoured vehicles,guns:భారత్‌కు అమెరికా రక్షణ సహకారం..స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలు,హోవిట్జర్‌, ఎం777 గన్‌లు

అమెరికా పర్యటనలో భాగంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశమైన తర్వాత భారతదేశానికి అమెరికా రక్షణ సహకారం అందనుంది. పెంటగాన్ న్యూఢిల్లీకి పలు అధునాతన ఆయుధాలు, ఆర్మర్డ్ వాహనాలతోపాటు అదునాతన సాంకేతికతను అందించేందుకు సిద్ధమైంది....

US offers Stryker armoured vehicles,guns:భారత్‌కు అమెరికా రక్షణ సహకారం..స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలు,హోవిట్జర్‌, ఎం777 గన్‌లు

US offers Stryker armoured vehicles

US offers Stryker armoured vehicles,guns: అమెరికా పర్యటనలో భాగంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశమైన తర్వాత భారతదేశానికి అమెరికా రక్షణ సహకారం అందనుంది.(PM Modi US Visit 2023) పెంటగాన్ న్యూఢిల్లీకి (Pentagon offering New Delhi)పలు అధునాతన ఆయుధాలు, ఆర్మర్డ్ వాహనాలతోపాటు అదునాతన సాంకేతికతను అందించేందుకు సిద్ధమైంది. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలు, హూవిట్టజర్. ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు అందించేందుకు అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతోపాటు ఎం777 గన్ ల అప్ గ్రేడ్(M777 gun upgrade to India), ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, జీఈ-ఎఫ్ 414 ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల తయారీకి సాంకేతిక సహకారాన్ని అమెరికా అందించనుంది.

PM Modi menu for US State dinner: మిల్లెట్ కేకులు, టాంగీ అవోకాడో సాస్..ఇవీ యూఎస్‌లో మోదీ డిన్నర్ మెనూ

రక్షణ పరికరాల ఒప్పందాలు మోదీ అమెరికా పర్యటన ఫలితాల్లో ముఖ్యమైనది. భారతదేశంలో 2.7 బిలియన్ డాలర్ల చిప్ ప్లాంట్ కోసం మైక్రోన్‌తో ఒప్పందంపై సంతకం చేయడం, క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సుపై ఒప్పందాలు మోదీ పర్యటనలో కీలకమైనవి. జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ ఉత్పత్తి చేసిన స్ర్టైకర్ ఆర్మర్డ్ 8 చక్రాల సాయుధ పదాతిదళ వాహనాన్ని ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌లను ఎదుర్కోవడానికి యూఎస్ సైన్యం వాడింది. ఈ మిలటరీ వాహనం సాయంతో కొండల్లోనూ లక్ష్యాలపై దాడి చేయవచ్చు.

PM Modi in Washington streets: మోదీని చూసేందుకు వీధుల్లో బారులు తీరిన ప్రజలు

అమెరికా పర్యటన సందర్భంగా భారత్ డ్రోన్‌ల కొనుగోలుకు మార్గం సుగమమైంది. ఉత్తర భారతదేశంలో ఫిరంగుల నుంచి సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి యూఎస్ ఖచ్చితమైన గైడెడ్ లాంగ్ రేంజ్ మందుగుండు సామగ్రితో 155 ఎంఎం ఎం777 హూవిట్జర్లను అప్ గ్రేడ్ చేసేందుకు అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. సైబర్ సెక్యూరిటీ సహకారంపై భారతదేశం, యూఎస్ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి.

PM Modi meets Joe Biden: వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో మోదీ సమావేశం

రాబోయే దశాబ్దంలో దేశీయంగా తయారు చేసిన యుద్ధ విమానాలకు శక్తినిచ్చే ఎఫ్-414 ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లతో పాటు సాయుధ డ్రోన్‌లు కొనుగోలుకు ఒప్పందాలు కుదరవచ్చని భావిస్తున్నారు. చైనా నుంచి భారతదేశం ఎదుర్కొంటున్న సవాలును ఎదుర్కొనేలా హంటర్-కిల్లర్ రీపర్ డ్రోన్‌ల కొనుగోలుకు మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అతిపెద్ద ఒప్పందం ఉంటుందని భావిస్తున్నారు.