Rihanna Diamond watch : చేతికి పెట్టుకునే వాచ్ మెడకు.. నటి రిహన్నా వజ్రాల వాచీ ధర ఎంతో తెలుసా..?!

ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ అయిన పారిస్ లో ఓ సింగర్ ధరించిన వాచ్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. చేతికి ధరించే వాచ్ మెడకు ధరించిన ఆ వాచ్ లో వజ్రాల ధగధగలు హాట్ టాపిక్ గా మారాయి.

Rihanna Diamond watch : చేతికి పెట్టుకునే వాచ్ మెడకు.. నటి రిహన్నా వజ్రాల వాచీ ధర ఎంతో తెలుసా..?!

Rihanna Diamond watch

Rihanna Diamond watch : పారిస్.. ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్. పారిస్ (paris)లో ప్రతీ పది నిమిషాలకు ఫ్యాషన్ మారిపోతుందంటారు. అటువంటి పారిస్ ఎల్వీ ఫ్యాషన్ వీక్‌లో చేతికి ధరించాల్సిన వాచీ మెడకు ధరించినా అదొక ఫ్యాషనే. మరి అలా వాచీని మెడకు ధరించిన వ్యక్తి ఓ సెలబ్రిటీ అయితే మరి అది ఫ్యాషన్ కాక మరేమవుతుంది. పైగా అది వజ్రాల వాచీ. వజ్రాల వాచీ అంటే మరి దాని ధర ఎంత ఉంటుంది? ఆ ధరించిన సెలబ్రిటీ ఎవరు? వంటి ఆసక్తి పెరగకమానదు కదా. మరి వజ్రాల వాచీ విశేషాలు.. చేతికి ధరించే వాచీని మెడకు ధరించి ఫ్యాషన్ షోలో సందడి చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుని సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్న ఆ సుందరాంగి ఎవరో తెలుసుకుందాం..

PM Modi’s Gifts To Joe Biden, First Lady: జోబిడెన్ దంపతులకు మోదీ ఏం బహుమతులు ఇచ్చారంటే…

ఆమె పేరు రిహన్నా(Rihanna).. అమెరికన్ సింగర్, నటి కూడా. ఆమె పాప్ ఐకాన్, స్టైల్ ఐకాన్, బిలియనీర్ బిజినెస్ ఓనర్ కూడా. రిహన్నా (Rihanna) లో లూయిస్ విట్టన్ ఫ్యాషన్ (Louis Vuitton Fashion Show) వీక్‌లో మెడకు ధరించిన వాచీ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వజ్రాలతో ధగధగలాడిపోతున్న ఆ వజ్రాల వాచీ అందరి మనస్సుల్ని కొల్లగొట్టింది. వావ్ ఏమి అందం అనేలా చేస్తోంది. జాకోబ్ అండ్ కో వాచ్ కంపెనీ (Jacob & Co.) దీనిని తయారు చేసింది. రిహన్నా చిరకాల మిత్రుడు జాకబ్ అరబో (Jacob Arabo)ఈ వాచ్ చోకర్ ని రూపొందించారు. జాకబ్ అరబో ఆభరణాలు, వాచ్ డిజైనర్. ఆయన క్రియేట్ చేసిన ఈ వాచీ విలువ దాదాపు రూ. 5.7 కోట్లు.. ఈ వాచీయే ఓ విశేషమనుకుంటే వాచీని మెడకు చోకర్‌లా ధరించడం కూడా ఇదే తొలిసారి కావటం మరో విశేషం.

Scientists Search 300 year Old wheats : 300 ఏళ్ల నాటి గోధుమలపై శాస్త్రవేత్తల పరిశోధనలు .. ఇక పురాతనకాలంనాటి ఆహారమే దిక్కు కాబోతోందా?

ఈ వాచీలో మొత్తం 368 వజ్రాలు పొదిగారు. 47 మిల్లీమీటర్ల వైట్ గోల్డ్ బ్రిలియంట్ ఫ్లైయింగ్ టూర్‌బిల్లన్‌ను చోకర్‌గా ధరించడానికి వీలుగా తయారు చేశారు. కాగా రిహన్నా రెండోసారి గర్భవతి అయ్యారు. రెండోసారి గర్భవతి అయిన రిహన్నా డెలిమ్ షర్ట్, జీన్స్, భారీ జాకెట్, బీనీలో బేబీ బంప్ ను ప్రదర్శిస్తు క్యాట్‌వాక్ చేయటం ఇంకో విశేషం. వజ్రాల వాచీని చోకర్ లా ధరించి బేబీ బంప్ తో క్యాట్ వాక్ తో రిహన్నా వైపు అందరి దృష్టి ఉంది.