YashoBhoomi In Delhi : ఢిల్లీలో మరో అద్భుతం ‘యశోభూమి’.. రేపే ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

దేశ రాజధాని ఢిల్లీలో మరో అద్భుతమైన నిర్మాణం అందుబాటులోకి రానుంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi ) పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేతుల మీదుగా యశోభూమి (YashoBhoomi) కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం కానుంది.

YashoBhoomi In Delhi : దేశ రాజధాని ఢిల్లీలో మరో అద్భుతమైన నిర్మాణం అందుబాటులోకి రానుంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi ) పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేతుల మీదుగా యశోభూమి (YashoBhoomi) కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం కానుంది. ఆదివారం (సెప్టెంబర్ 17,2023) ప్రధాని మోదీ పుట్టిన రోజున ప్రపంచంలోని అతిపెద్ద MICE (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు మరియు ప్రదర్శనలు) సౌకర్యాలలో ఒకటి అయిన యశోభూమి (YashoBhoomi) నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ప్రధాని యశోభూమి పేరుతో నిర్మించిన అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌ (Yashobhoomi convention center)ను ప్రారంభించి..దేశానికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ద్వారకా సెక్టార్ 21 నుండి ద్వారకా సెక్టార్ 25 వద్ద కొత్త మెట్రో స్టేషన్ వరకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగింపును కూడా ఆయన అంకితం చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇది ఫేజ్ 1 ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (IICC) అని పిలుస్తారు. ఈ కన్వెన్షన్ సెంటర్లో 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 15 సమావేశ గదులు, ఒక గ్రాండ్ బాల్‌రూమ్ మరియు 11,000 మంది ప్రతినిధుల కోసం 13 సమావేశ గదులు ఉన్నాయి. దేశంలో సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహించేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రధాని మోదీ ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.

మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల ప్రాజెక్ట్ వైశాల్యం, మొత్తం 1.8 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ బిల్ట్ అప్ ఏరియాతో, YashoBhoomi ప్రపంచంలోనే అతిపెద్ద MICE (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు ప్రదర్శనలు) సౌకర్యాలలో తన స్థానాన్ని పొందుతుంది.

QR code-enabled Pendants : తప్పిపోయినవారు ఇంటికి తిరిగి రావడానికి సహాయం పడే QR కోడ్ లాకెట్లు

యశోభూమి ప్రత్యేకతలు..
యశోభూమి కన్వెన్షన అండ్ ఎక్స్ పో సెంటర్ (Yashobhoomi convention center)అని కూడా పిలిచే ఈ సెంటర్ ప్రాజెక్టు మొత్తం విస్తీర్ణం 8.9 లక్షల చదరపు మీటర్లు. బిల్ట్‌‌అప్ విస్తీర్ణం 1.8 లక్షల చదరపు మీటర్లు.

యశోభూమి మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఒక బాల్ రూమ్, 13 మీటింగ్ రూములున్నాయి. వీటిలో మెయిన్ ఆడిటోరియం, గ్రౌండ్ బాల్ రూమ్,11,000మంది ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చే కెపాసిటీ ఉంది.

మెయిన్ ఆడిటోరియంలో 6,000మంది కూర్చునే కెపాసిటీ ఉంది. గ్రౌండ్ బాల్ రూమ్ మరో 2,500లమందికి ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం ఉ:ది. అలాగే మరో 500లమంది కూర్చోగలిగే విస్తారమైన ప్రదేశం ఉంది.

కన్వెన్షన్ సెంటర్ ను సుమారు 73,000 చదరపు మీటర్లకుపైగా వైశాల్యంలో నిర్మించారు. అన్ని గదులలో కలిపి ఒకేసారి 11,000 మంది ఆసీనులు కావొచ్చు.

6,000 మంది అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రధాన ఆడిటోరియం(ప్లీనరీ హాల్) ను నిర్మించారు. ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టమ్ ఉంటుంది.

అత్యంత ఆకర్షణీయమైన సీలింగ్ తో ఆకట్టుకుంటున్న బాల్ రూం మ్ సీటింగ్ సామర్థ్యం 2,500. ఇక్కడే మరో 500 మంది కోసం ఓపెన్ ఏరియా కూడా ఉంది. 1.07 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి.

మీడియా రూమ్స్, వీవీఐపీ గదులు, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టికెటింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఇక్కడ వర్షం నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసుకొని మళ్లీ ఉపయోగించుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

సౌర విద్యుత్ కోసం రూప్ టాప్ సోలార్ ప్యానళ్లను బిగించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు.

యశోభూమి కన్వెన్షన్ సెంటర్ భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినమ్ సరిఫికేషన్ పొందింది.







                                    

ట్రెండింగ్ వార్తలు