QR code-enabled Pendants : తప్పిపోయినవారు ఇంటికి తిరిగి రావడానికి సహాయం పడే QR కోడ్ లాకెట్లు

జ్ఞాపకశక్తి కోల్పోయో లేదా, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోతే వారిని ఇంటికి చేర్చేందుకు ఉపయోగపడే క్యూఆర్ కోడ్ (QR enabled pendant )ని రూపొందించారు ఓ యువ ఇంజనీర్.

QR code-enabled Pendants :  తప్పిపోయినవారు ఇంటికి తిరిగి రావడానికి సహాయం పడే QR కోడ్ లాకెట్లు

QR code-enabled Pendants

QR code-enabled Pendants : తప్పిపోయినవారిని కుటుంబ సభ్యుల వద్దకు చేరుస్తోంది టెక్నాలజీ. మనిషి జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్య పరిష్కారం చూపిస్తోంది టెక్నాలజి. ఈ టెక్నాలజీ లో క్యూఆర్ కోడ్ అనేది కీలకంగా మారింది. నగదు బదిలీలకే కాదు ఇప్పుడు మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయో లేదా, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోతే వారిని ఇంటికి చేర్చేందుకు ఉపయోగపడే క్యూఆర్ కోడ్ (QR pendant )ని రూపొందించారు ఓ యువ ఇంజనీర్.

కుటుంబ నుంచి తప్పిపోయి తమ ఇంటి వివరాలు చెప్పలేనివాళ్ల కోసం క్యూఆర్ కోడ్ చక్కటి సాధనంగా మారింది. QR కోడ్- కలిగిన లాకెట్టు(QR pendant ). ఇటువంటి సమస్యలకు చక్కగా ఉపయోగపడుతుంది. బాధితరులు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోవడంలో ఈ క్యూఆర్ కోడ్ ఉన్న లాకెట్ (QR pendant )చక్కటి సహాయకారిగా ఉంటుంది.

Delhi High Court : భార్య దగ్గర లేనప్పుడు భర్త వేరే మహిళ వద్ద ఉండటంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

అక్షయ్ రిడ్లాన్ అనే 24 ఏళ్ల డేటా ఇంజనీర్ ( data engineer, Akshay Ridlan)అభివృద్ధి చేసిన QR కోడ్ పెండెంట్లు ఇంటి నుంచి తప్పిపోయి తమవారి గురించి వివరాలు చెప్పలేని వారికి ఉపయోగకరంగా ఉంటుంది. దివ్యాంగులు, వికలాంగులు, అల్జీమర్ బాధితులు,వృద్ధులు పొరపాటున ఒక్కోసారి వారు తమవారి నుంచి తప్పిపోతే ఈ లాకెట్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా వారి సొంతవారిని గుర్తించవచ్చు. ఇటువంటివారు తమ ఇళ్ల నుండి బయటికి వెళ్లినప్పుడు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారితప్పిపోయే అవకాశాలున్నాయి. అలా జరిగితే వారి ఆచూకీ తెలుసుకోవటానికి ఈ క్యూఆర్ కోడ్ లాకెట్లు ఉపయోగపడతాయి.

మానసిక వైకల్యం, ట్రీట్ మెంట్ పరంగా ఎమర్జన్సీ పరిస్థితులతో ఉన్నవారి కోసం ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత లాకెట్లు అందించటానికి చేతన (Project Chetna) ప్రాజెక్ట్ చేపట్టారు. దీని ద్వారా బాధితులు వారి కుటుంబాలను సులభంగా చేరుకోవచ్చు.

Tina Dabi, Pradeep Gawande : అమ్మానాన్నలు అయిన ఐఏఎస్ దంపతులు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టీనాదాబీ

అది ఎలాగంటే..ఎవరైనా లాకెట్టులో కస్టొమైజ్డ్ QR కోడ్‌లను స్కాన్ చేస్తే..ఆ లాకెట్ ధరించిన వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక వివరాల(Basic details)ను తెలుస్తాయి. ఈ కోడ్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు. ఆ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ లాకెట్ ధరించినవారి పేరు, వారి ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ అలా వారి బ్లడ్ గ్రూప్ (blood group)వంటివి దీంట్లో పొందుపరచబడి ఉంటాయి.

అల్జీమర్స్ వ్యాధి(Alzheimers), మానసిక వైకల్యం, స్కిజోఫ్రెనియా(schizophrenia) లేదా ఆటిజం(autism)తో బాధపడుతున్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.QR pendant ఎక్కువగా ఉపయోడుతుంది. ఈ టెక్-ఎనేబుల్డ్ లాకెట్టు(tech-enabled pendant) ఒంటరిగా స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ QR కోడ్ పెండెంట్లు భారతదేశం అంతటా అందుబాటులో ఉంటాయి.