Sreet Dogs properties : కోట్లకు పడగలెత్తిన వీధికుక్కలు .. ఆ గ్రామంలో కుక్కలకు కోట్ల విలువ చేసే ఆస్తులు

ఆ గ్రామంలో కుక్కల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. ఆ కుక్కల కోసం ప్రత్యేకించి వంట వాళ్లు. వాటికి 24 గంటలు అందుబాటులో డాక్టర్లు ఉంటారు.

Gujarat Village sreets Dogs Property

Property for Gujarat Village sreets Dogs : అదొక గ్రామం. గ్రామం అన్నాక ఆ గ్రామంలో కుక్కలుంటాయి. కానీ ఓ గ్రామంలో ఉండే కుక్కల రేంజే వేరు. ఆగ్రామంలో ఉండే కుక్కలకు కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. భూములున్నాయి. ఏంటీ వీధికుక్కలకు ఆస్తులా..? ఎవరిచ్చారు?ఎందుకిచ్చారు? ఆ ఆస్తులను ఎవరు సంరక్షిస్తున్నారు? అనే ప్రశ్నలు వచ్చి తీరుతాయి. అసలు వీధికుక్కలకు ఆస్తులేంటీ..ఎవరిచ్చారు?అనేది ఓ గొప్ప సందేహం వచ్చి తీరుతుంది…

అది గుజరాత్‌(Gujarat)లోని మెహసానా జిల్లా(Mehsana District)లోని పంచోత్‌ గ్రామం(Panchot Village). ఆ గ్రామస్తులు కుక్కల్ని ఇలా చీదరించుకోరు. పైగా ఎంతో ఆత్మీయంగా చూసుకుంటారు. ఎందుకంటే ఆ గ్రామంలో ప్రజలకు వీధికుక్కలే యజమానులు…నమ్మలేకపోయినా ఇది నిజమండి బాబూ..పంచోత్‌ గ్రామంలో ఎక్కువ మంది జంతు ప్రేమికులే.. అంతేకాదు జంతువులకు సేవ చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతుంటారు. అందునా కుక్కలకు తిండిపెడితే స్వర్గం ప్రాప్తిస్తుందని విశ్వాసిస్తున్నారు. ఈ నమ్మకం.. విశ్వాసం భక్తిగా మారడంతో తమ ఆస్తిలో వాటాను కుక్కల పేరిట రాసిచ్చేస్తుంటారు. ఇలా పంచోత్‌ గ్రామంలో కుక్కల పేరిట 25 భిఘాల భూమి ఉంది. భిగా అంటే 17 వేల చదరపు అడుగులు. ఒక్క భిఘా ధర స్థానికంగా 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఉంటుందట. అంటే కుక్కల పేరున ఉన్న ఆస్తే దాదాపు 100 కోట్లు.

Millionaire Pigeons: పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు, మన ఇండియాలోనే

ఈ డబ్బు.. భూమి పరిరక్షణకు పంచోత్‌ గ్రామంలో ప్రత్యేకంగా ఓ ట్రస్టు (Trust)ఉంది. దాతలు కుక్కల పేరున రాసిన భూమిని సాగు చేసుకునేందుకు రైతులకు లీజుకిస్తారు. బహిరంగ వేలం(auction)లో లీజు మొత్తం నిర్ణయిస్తారు. వచ్చే డబ్బుతో కుక్కల పోషణ (Dog nutrition)చూస్తోంది ట్రస్టు. కుక్కలకు తిండి పెట్టడం.. అనారోగ్య సమస్యలు వస్తే వైద్యం చేయించడం ఇలా కుక్కల సంరక్షణ బాధ్యత అంతా ట్రస్టు దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఈ గ్రామంలో కుక్కలకు 24 గంటల వైద్యం అందుబాటులో ఉంది. అంతే కాదు శునక రాజుల కోసం ప్రత్యేకంగా ఇద్దరు వంటవాళ్లను నియమించుకుంది ట్రస్టు. ఆరోగ్యకరమైన ఆహారం వండిపెడుతుంటారు.

ప్రతి రోజు కుక్కల కోసం ఆహారం తయారు చేయించడం.. అవి ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఆ ఆహారం పెట్టడం వలంటీర్ల చూసుకుంటారు. ఇందుకోసం పటీదార్ల సంఘం ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ రెండు బృందాలు పంచోత్‌ గ్రామంలోనే కాదు… చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో తిరుగుతూ కుక్కలకు ఆహారం పెడుతుంటారు. రోజుకు కనీసం వెయ్యి రోటీలు తయారు చేయించి కుక్కలకు ఆహారంగా పెడుతుంటారు.

Monkeys, pigeons own properties : కోతులకు 32 ఎకరాల సొంత భూమి .. పావురాల పేరున రూ. కోట్లు విలువ చేసే ఆస్తులు

 

 

ట్రెండింగ్ వార్తలు