Navaratri 2023 : ఒంటి చేత్తో బుల్లెట్‌ నడుపుతు కత్తులతో మహిళలు ‘గర్బా’ విన్యాసాలు

రాజ్ కోట్ మహిళలు విన్యాసాలు చూస్తే నిజంగా ఆదిశక్తిలకు ప్రతిరూపమా అనేలా ఉన్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతు..మరో చేత్తో కత్తులు తిప్పుతు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Rajkot Womens perform Garba

Rajkot Womens  ‘Garba’ perform On motorcycles : ఉత్తరాదిలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండవగా జరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలను మహిళలు చాలా భిన్నంగా జరుపుకుంటారు. సాక్షాత్తు అమ్మవారి శక్తిని చాటి చెప్పేలా నిర్వహిస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి బుల్లెట్ మోటార్ సైకిళ్లపైనా..జీపులు,కార్లు వంటి వాహనాలపై కత్తులతో విన్యాసాలు చేస్తారు. ఈ ఏడాది కూడా నవరాత్రి ఉత్సవాల్లో గుజరాత్ మహిళలు సత్తా చాటారు. మహిళలు చేసిన విన్యాసాలు చూస్తే నిజంగా ఆదిశక్తిలకు ప్రతిరూపమా అనేలా ఉన్నాయి. కత్తులతో మహిళలు చేసిన ఫీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Navaratri 2023 : అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు దేనికి సంకేతమో తెలుసా?

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మంగళవారం (అక్టోబర్ 17,2023) మూడో రోజైన నవరాత్రి ఉత్సావాల్లో భాగంగా మహిళలు జీపు, మోటార్ సైకిళ్లపై కత్తులతో ‘గర్బా’ ప్రదర్శించారు. నవరాత్రి ఉత్సవాల్లో ‘తల్వార్ రాస్’ చేయటం గుజరాత్ సంప్రదాయం. దీంట్లో భాగంగా రాజ్‌కోట్‌లోని రాజ్‌వి ప్యాలెస్‌లో దుర్గామాతను పూజించి సంప్రదాయ రాజ్ పునాతా వస్త్రధారణలో మహిళలు తల్వార్ రాస్ ప్రదర్శించారు.

ఈ వీడియోలో ఓ మహిళ బుల్లెట్ వాహనాన్ని ఒంటిచేత్తో నడుపుతు..స్పీడ్ గా రౌండ్లు కొడుతు తల్వార్ ని గిరగిరా తిప్పుతు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తోటి మహిళలంతా చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. మరో మహిళ ఒకచేత్తో జీప్ నడిపుతు ‘తల్వార్ రాస్’ ప్రదర్శించారు. మరికొంతమంది మహిళలు టూవీర్స్ నడుపుతుంటే మరికొంతమంది వెనుక నిలబడి ‘తల్వార్ రాస్’ ప్రదర్శించారు. స్పీడ్ గా రౌండ్లు కొడుతున్న వాహనాలపై చక్కటి బ్యాలెన్స్ చేస్తు కత్తులతో మహిళలు చేసిన విన్యాసాలపై మీరు కూడా ఓ లుక్కేయండీ..