Navaratri 2023 : అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు దేనికి సంకేతమో తెలుసా?

అమ్మవారి చేతిలో దేవతలు వరంగా ఇచ్చిన ఆయుధాలు కనిపిస్తాయి. అయితే ఈ ఆయుధాలు వేటికి సంకేతమో తెలుసా?

Navaratri 2023 : అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు దేనికి సంకేతమో తెలుసా?

Navaratri 2023

Navaratri 2023 : చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా మనం దసరా పండుగ జరుపుకుంటాం. అయితే అమ్మవారి  చేతుల్లో ఉన్న ఆయుధాలు వేటికి ప్రతీకనో మీకు తెలుసా?

Dussehra 2023 : దసరా అంటే అందరికీ సరదానే.. కానీ ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా?

బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపడతాడు. దిక్కులేని పరిస్థితుల్లో దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకుంటాడు. మహిషునిపై వారిలో కలిగిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజస్సుగా మారింది. త్రిమూర్తులు కలిసి స్త్రీ రూపంగా జన్మించింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా అమ్మవారు 18 చేతులతో అవతరించింది. శివుడి శూలం, విష్ణువు చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశం, బ్రహ్మ అక్షమాల, కమండలం, హిమవంతుడు సింహాన్ని ఇచ్చారు. ఇలా సకల దేవతలు ఇచ్చిన ఆయుధాలు అమ్మవారి చేతిలో కనిపిస్తాయి.

శంఖం: శంఖం ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపంలో అమ్మవారు కొలువై ఉందని సూచిస్తుంది.
ధనుర్భాణాలు: ఇవి శక్తి ని సూచిస్తాయి. ధనుర్భాణాలని ఒక చేతిలో ధరించిన దుర్గా మాత తాను స్థితి గతి శక్తులు రెండింటి మీదా అధికారం కలిగియున్నానని చెబుతుంది.
ఈటె: అగ్ని దేవుడు దుర్గామాతకు ఇచ్చిన ఆయుధం ఈటె. శక్తికి, శుభానికి దీనిని చిహ్నంగా భావిస్తారు. చెడు, మంచి వ్యక్తుల మధ్య బేధానికి ఇది ప్రతీక.

Navaratri 2023 : పరమశివుడికే అన్నదానం చేసిన ‘అన్నపూర్ణా దేవి’

గొడ్డలి: విశ్వకర్మ మహాముని ఇచ్చిన గొడ్డలిని చెడుతో పోరాటానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భయపడకూడదని ఇది సూచిస్తుంది.
గద: అమ్మవారి చేతిలో ఉండే గద ధృడ సంకల్పానికి ప్రతీక. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని అర్ధం.
సుదర్శన చక్రం: సుదర్శన చక్రం దుర్గా మాత ఆజ్ఞకి ఈ విశ్వం అంతా లోబడి నడుస్తుందని అర్థం.

kitchen : అన్నపూర్ణాదేవి నియలమైన వంటింట్లో ఇవి ఉంటే దరిద్రం..
ఖడ్గం: అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గం..పదునైన జ్ఞానాన్ని సూచిస్తుంది.
త్రిశూలం: మూడు గుణాలైన సత్వ ,రజో , తమో గుణాలకి ప్రతీక త్రిశూలం . శారీరక,మానసిక, ఆధ్యాత్మిక అవరోధాలని దుర్గా మాత తొలగిస్తుంది.
వజ్రాయుధం: ఇంద్రుడు ఇచ్చిన వజ్రాయుధ శక్తి, బలమైన సంకల్ప శక్తికి సూచనగా నిలుస్తుంది.
అభయముద్ర: దుర్గాదేవి అభయాన్ని ఇస్తూ సింహం మీద నిలుచుని ఉంటుంది. మీ భయాలు, భారాలు అన్నీ నా మీద వేయండి.. నేను మోస్తాను.. అన్నట్లు అమ్మవారు భక్తులకు అభయమిస్తున్నట్లు అర్ధం.