డిప్యూటీ సీఎం పవన్ దర్శనం చేసుకుని వెళ్లారు.. అంతేతప్ప భక్తులకు ఎక్కడా ఆటంకం కలిగించలేదు: అనిత

ఎమ్మెల్యేలు సైతం బంగారపు వాకిలిలోనే దర్శనం చేసుకొని వెళుతున్నారని చెప్పారు.

డిప్యూటీ సీఎం పవన్ దర్శనం చేసుకుని వెళ్లారు.. అంతేతప్ప భక్తులకు ఎక్కడా ఆటంకం కలిగించలేదు: అనిత

Home minister Anitha Vangalapudi

Updated On : October 9, 2024 / 3:26 PM IST

నవరాత్రుల వేళ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వీఐపీలు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ భక్తులకు ఎక్కడా అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్లారు తప్ప భక్తులకు ఎక్కడ ఆటంకం కలిగించలేదని చెప్పారు.

సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం కోసం అంతరాలయ దర్శనాన్ని ఇవాళ నిలిపివేశామని అనిత తెలిపారు. ఎమ్మెల్యేలు సైతం బంగారపు వాకిలిలోనే దర్శనం చేసుకొని వెళుతున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మవారికి పట్టి వస్త్రాలు సమర్పిస్తారని, సీఎం వచ్చే సమయంలోనూ భక్తులకు దర్శనం నిలుపుదల చేయమని స్పష్టం చేశారు.

మూలా నక్షత్రం సందర్భంగా తాను ఇవాళ అమ్మవారిని దర్శించుకున్నానని అనిత్ అన్నారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు అన్ని పరిశీలించానని తెలిపారు. క్యూ లైన్‌లో భక్తులతో సైతం మాట్లాడానని, అందరూ ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారని తెలిపారు. భవానీలకు సంబంధించి ప్రత్యేకమైన క్యూలైన్ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.

పెళ్లికి ముస్తాబై ఆ అలంకరణతోనే బైక్ నడిపిన అమ్మాయి