Rat Bathing in Rain : వార్నీ.. వానలో స్నానం చేస్తున్న ఎలుక.. సబ్బు ఇస్తే బాగుండు అంటూ కామెంట్లు

జల్లుజల్లుగా వాన చినుకులు పడుతుంటే చక్కగా ఎంజాయ్ చేస్తు స్నానం చేస్తోంది ఓ ఎలుక. తలమీద ముందున్న రెండు కాళ్లను చేతుల్లాగా తిప్పుతు వానచినుకులు టపటపా తలమీద పడుతుంటే వాటితో తల తడుపుకుంటున్నట్లుగా స్నానం చేస్తున్న ఈ ఎలుకకు శుభ్రత బాగా ఎక్కువలా ఉందే..

Rat Bathing in Rain

Rat Bathing in Rain : అదొక ఎలుక. అచ్చంగా మనిషిలానే స్నానం చేస్తోంది. ఎలుకేంటీ స్నానం చేయటమేంటీ..? అని ఆశ్చర్యపోతాం. సాధారణంగా ఎలుకు దుర్వాసన వచ్చే ప్రాంతాల్లో కూడా జీవిస్తుంటాయి. డ్రైనేజీల్లో కూడా ఎలుకలు సంచరిస్తుంటాయి. అటువంటిది ఎలుక స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ ఎలుక జోరుగా కురుస్తున్న వర్షంలో చక్కగా షవర్ బాత్ చేస్తోంది. జల్లుజల్లుగా వాన చినుకులు పడుతుంటే చక్కగా ఎంజాయ్ చేస్తు స్నానం చేస్తోంది. తలమీద ముందున్న రెండు కాళ్లను చేతుల్లాగా తిప్పుతు వానచినుకులు టపటపా తలమీద పడుతుంటే వాటితో తల తడుపుకుంటున్నట్లుగా స్నానం చేస్తోంది. ఎలుక వాన నీటిలో స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇదేంది రా బాబూ ఇది ఎలుకేనా ఇంత శుభ్రత పాటిస్తోందేంటీ అంటున్నారు చూసిన వారు. పైగా ఆ ఎలుకకు ఓ సబ్బు కూడా ఇస్తే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భారీ వర్షం (heavy rain) పడడంతో రోడ్డుపై నీరు ప్రవహిస్తూ జారీగా ప్రవహిస్తోంది. అదే సమయంలో బొరియ నుంచి బయటకొచ్చిన ఎలుక (rat).. ఉన్నట్టుండి శుచి, శుభ్రత గుర్తుకొచ్చినట్లుంది. వాననే షవర్ అనుకుని చక్కగా స్నానం చేస్తోంది.

వర్షం పడుతున్న సమయంలో మనుషులు ఎలా ఎంజాయ్ చేస్తారో.. అచ్చం ఆ ఎలుక కూడా అలాగే తలపై పడుతున్న వాన చినుకులతో తల నిమురుకుంటు స్నానం (rat bathing in rain) చేసింది. స్నానం చేసింది. వర్షం నీటిని మొఖంపై పోసుకుని మొహం కూడా కడుక్కున్న తీరు చూస్తే భలే ముచ్చటేస్తోంది.

Also Read: 90 ఏళ్ల మహిళ, 74 ఏళ్లు సెలవు తీసుకోకుండా ఉద్యోగం.. ఆమె వర్క్ ఏంటో తెలుసా..?

తల, మిగతా శరీరాన్ని కూడా మనుషుల్లానే చక్కగా వాన నీటితో శుభ్రం చేసుకుంటుంది. తల మీద ఉన్న మురికి మొత్తం పోయే వరకూ స్నానం చేస్తూనే ఉంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయటంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వార్నీ ఇది ఎలుకా? మరీ ఇంత శుభ్రత పాటిస్తోందే..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరైతే పనిలో పని దానికి ఓ సబ్బు కూడా ఇస్తే బాగుండే అంటున్నారు. ఇలా ఎవరికి తోచిన కామెంట్లు వారు చస్తున్నారు. ఈ వీడియో లక్షల వ్యూస్‌ తో దూసుకుపోతోంది. మరి ఈ ఎలుక బాతింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండీ ఓ కామెంట్ ఏస్కోండి..

Rat Bathing, Rain,very clean rat,