Melba Mebane : 90 ఏళ్ల మహిళ, 74 ఏళ్లు సెలవు తీసుకోకుండా ఉద్యోగం ..ఆమె వర్క్ ఏంటో తెలుసా..?
ఏడు దశాబ్దాలకు పైగా సెలవు అనేది పెట్టకుండా ఉద్యోగం చేసి 90 ఏళ్ల వయస్సులో రిటర్మెంట్ తీసుకున్నారు ఓ మహిళ. ఆమెకు కంపెనీ ఇచ్చిన గౌరవం ఏంటో తెలుసా..?

90 Year Old Woman Retires Melba Mebane
90 Year Old Woman Retires Melba Mebane : సెలవుల కోసం వింత వింత సాకులు చెప్పే ఉద్యోగుల్ని చూశాం. కానీ 74 ఏళ్లు సెలవు అనేదే పెట్టకుండా నిరంతరాయంగా డ్యూటీ చేసిన మహిళ గురించి మీకు తెలుసా..?ఉద్యోగం చేసే మహిళలు ఉద్యోగ బాధ్యతలే కాకుండా ఇంటి బాధ్యతలు కూడా ఉంటాయి. అటువంటి ఓ మహిళ (90 year old woman)74 ఏళ్ల 74 ఏళ్ల పాటు సెలవు అనేదే పెట్టకుండా ఉద్యోగం చేసారు అంటే మాటలుకాదు. అందుకే ఆమె వార్తల్లో నిలిచారు. హ్యాట్సాఫ్ అమ్మా అనిపించుకున్నారు. ఆమె గురించి చెప్పేముందు మరో మాట 74 ఏళ్లు సెలవు పెట్టుకుండా ఉద్యోగం చేయటమే కాదు సాధారణంగా ఎవరైనా 60 ఏళ్ల లోపు రిటైర్ అవుతారు. కానీ ఈమె మాత్రం అంటేకు 90 ఏళ్ల వయస్సులో రిటర్మెంట్ తీసుకన్నారు.
United States : 63 ఏళ్ల తర్వాత హైస్కూల్ క్రష్‌కు ప్రపోజ్ చేసిన 78 ఏళ్ల వ్యక్తి
ఏడు దశాబ్దాలకు పైగా సెలవు అనేది పెట్టకుండా ఉద్యోగం చేసి 90 ఏళ్ల వయస్సులో రిటర్మెంట్ తీసుకున్నా ఆమె పేరు ‘మెల్బా మెబానే’(Melba Mebane). 16 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేశారు మెల్బా. 1949లో టెక్సాస్‌లో మేయర్ అండ్ ష్మిడ్ డిపార్ట్ మెంట్ స్టోర్ (Mayer and Schmidt department store)లో లిఫ్ట్ ఆపరేటర్(elevator girl)గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు ఆమె. స్వీట్ 16లో ఉద్యోగంలో చేరిన ఆమె నిరంతరాయంగా పనిచేస్తునే ఉన్నారు. ఆమె ఉద్యోగంలో జాయిన్ అయిన సంస్థ చేతులు మారినా ఆమె మాత్రం అదే ఉద్యోగంలో కొనసాగారు. అదే ఉద్యోగానికి అంకితమైపోయారు మెల్బా.
మేయర్ అండ్ ష్మిడ్ సంస్థను 1956లో డిలార్డ్ ( Dillard)అనే మరో సంస్థ సొంతం చేసుకుంది. కానీ మెల్బా మాత్రం లిఫ్ట్ ఆపరేటర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఆమె 74 ఏళ్ల పాటు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఉద్యోగం చేశారు. ఇటీవలే తన 90 ఏట రిటైర్మెంట్ తీసుకున్నారు. అలా ఆమె ఉద్యోగులకే కాదు అక్కడకు తరచు వచ్చే కష్టమర్ల కూడా ఆత్మీయంగా మారిపోయారు. ఈ సందర్భంగా సహోద్యోగులకు ఆమెకు భారీ ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. 90ఏళ్లలో రిటైర్ అయిన మెల్బా..ఇకనుంచి తనకు ఇష్టమైన ప్రదేశాలను చుట్టేస్తానని తెలిపారు. అంటే 90 ఏళ్ల వయస్సులో టూరిస్ట్ గా ఇష్టమైన పనిచేస్తానంటున్నారు ఆమె.