Spooky Golden Egg : మహాసముద్రంలో కనిపించిన ‘బంగారు గుడ్డు’ .. ఆ జీవి కోసం సముద్రాన్ని జల్లెడపడుతున్న శాస్త్రవేత్తలు

పసిఫిక్ మహా సముద్రం అడుగున ఓ బంగారు గుడ్డును కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఆ గుడ్డును ఏ జీవి పెట్టిందో తెలుసుకునే పనిలో పడ్డారు.

Spooky golden egg In Pacific Ocean

Spooky golden egg In Pacific Ocean : గాడిద గుడ్డు అంటారు.బంగారు బాతు గుడ్డు అంటారు. కానీ నిజంగానే బంగారు గుడ్లు ఉంటాయి. ఏ పక్షి అయినా బంగారు గుడ్డు పెడుతుందా..?అంటే ఎందుకు పెట్టవు అనేలాంటి ఓ ఘటన జరిగింది. ఫసిఫిక్ మహా సముద్రం అడుగున ఓ ‘బంగారు గుడ్డు’ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఆ బంగారు గుడ్డును ఏ జీవి పెట్టింది..? అనే దానికి గురించి ఏకంగా సముద్రాన్ని జల్లెడ పట్టేస్తున్నారు. ఆ బంగారు గుడ్డును ఏ జీవి పెట్టింది..?ఎప్పుడు పెట్టింది…? అంటూ పసిఫిక్ మహా సముద్రంలో ‘బంగారు గుడ్డు’ మిస్టరీని ఛేదించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు సముద్ర శాస్త్రవేత్తల బృందం.

Bolivia : ఆ జైలులో నేరస్తుడికి ఉరి తీస్తుంటే తోటి ఖైదీలు సంగీతం వాయిస్తారట.. ఎక్కడంటే?

పసిఫిక్ మహా సముద్రంలో దక్షిణ అలాస్కా (Alaska)తీరంలో ఆగస్టు 30(2023)న ఓ వింత వస్తువును గుర్తించారు శాస్త్రవేత్తలు. గుడ్డు ఆకారంలో ఉండే ఆ వింత వస్తువు బంగారం రంగులో ఉంది.దానికి ఓ వైపున రంధ్రం కూడా ఉంది. యూఎస్‌కు చెందిన సైంటిస్టులు సీస్కేప్ అలాస్కా (Seascape Alaska)యాత్రలో భాగంగా పసిఫిక్ మహా సముద్రంలో దాదాపు రెండు మైళ్ల లోతులో అంతరించిపోయిన అగ్నిపర్వతాన్ని (underwater volcano)అన్వేషిస్తున్న సమయంలో బంగారం రంగులో మెరిసిపోతున్న బంగారు గోళాన్ని కనుగొన్నారు. దీన్ని శాస్త్రవేత్తలు ‘స్పూకీ గోల్డెన్ ఎగ్’ (spooky golden egg)అని పిలుస్తున్నారు. శాస్త్రవేత్తలు ‘స్పూకీ గోల్డెన్ ఎగ్‌’ అని పిలుస్తున్న ఈ బంగారు గుడ్డును అక్కడ జీవించే ఏదో ఒక జీవి పొదిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ‘బంగారు గుడ్డు’ మిస్టరీని ఛేదించే ప్రయత్నాలు కొనసాగిస్తున్న సముద్ర శాస్త్రవేత్తల బృందం తలమునకలైంది.

Viral video : ఇంటిగోడలో ఇవెందుకు దాచి పెట్టావురా నాయనా, ఏదో అనుకుంటే ఇంకేవో బయటపడ్డాయే పాపం..

రిమోట్-నియంత్రిత పరికరాలను ఉపయోగించి, శాస్త్రవేత్తల బృందం ఒక నమూనాను సున్నితంగా సేకరించారు. బంగారు కవచంలో దాగి ఉన్న ఈ భయంకరమైన వింత గుడ్డును ఏ జంతువు పెట్టి ఉంటుందో తెలుసుకోవడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నారు. తమ పరిశోధనా చరిత్రలో ఇటువంటి వింత వస్తువును కనుగొనలేదని..ఇలాంటి వస్తువును తాము అస్సులు ఎప్పుడు చూడలేదని తెలిపారు. ఈ బంగారు గడ్డు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారయి. దీనిపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీన్ని X-ఫైల్స్ ఎపిసోడ్ (X-Files episode)దృశ్యాలతో పోలుస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు