Strange Disease : ఈ వింతవ్యాధి సోకితే డ్యాన్స్ చేస్తునే ఉంటారట..! డ్యాన్స్ చేస్తునే చనిపోతారట..!!

చరిత్రలో ఎన్నో వింత వ్యాధులు వేలాదిమంది ప్రాణాలు బలిగొన్నాయి.అటువంటి వ్యాధుల్లో ఓ వింత వ్యాధి ఈనాటికి ఓ మిస్టరీగా ఉండిపోయింది. ఆ వ్యాధి సోకిన మనుషులు విపరీతంగా డాన్స్ చేస్తారట..డాన్స్ చేస్తునే చనిపోతారట..అంతుపట్టనీ ఈ మిస్టరీ వెనుక కారణాలు ఏంటి..?

dancing plague of 1518 : వైద్య రంగంలో ఎన్నో పెనుమార్పులు వచ్చినా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ ఆధునిక కాలంలో వాటిని కనుగొని వాటిపై పరిశోధనలు చేసి మెడిసిన్స్ తయారు చేసి ప్రాణ నష్టాలను నియంత్రిస్తున్నాడు పరిశోధకులు. కానీ ఈనాటికి అంతుచిక్కని ఎన్నో వ్యాధులు ఉన్నాయి. చరిత్రలో కూడా ఎన్నో వింత వింత వ్యాధులు మనుషుల ప్రాణాల్ని కబళించాయి. వైరస్ లు కొన్ని ప్రాంతాల్నే తుడిచిపెట్టేసిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ప్లేగు వ్యాధికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 నుంచి 5 కోట్లమంది చనిపోయారని అంచనా..అత్యంత భయంకరమైన ఈ వ్యాధి చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. ప్లేగు, మశూచి, కలరా వంటి వ్యాధులు సోకితే అప్పట్లో ప్రాణాలు పోయేవి. వాటికి రాను రాను మెడిసిన్స్ కనుగొని కట్టడి చేశారు.

అలా కొన్ని వందల ఏళ్ల క్రితం వెలుగు చూసిన కొన్ని వ్యాధులకు చెక్ పెట్టినా కొన్ని వ్యాధులు మాత్రం ఈనాటికి అంతులేని రహస్యాలుగా ఉండిపోయాయి అంటే ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటివాటిలో ఓ వింత వ్యాధి గురించి చెప్పుకుని తీరాల్సిందే. అది వింత వ్యాధి. ఆ వ్యాధి సోకితే మనిషి డ్యాన్స్ చేస్తునే ఉంటాడట.. శరీరంలో శక్తి అంతా పోయినా..డ్యాన్స్ చేస్తునే ఉంటారట. 500 ఏళ్ల క్రితం 400మంది ప్రాణాలు తీసిన ఆ వింత వ్యాధి ఎందుకు సోకింది? ఎలా సోకింది..? దీనికి కారణాలు ఏంటీ..? అనే విషయాలు ఈనాటికి మిస్టరీగానే ఉండిపోయాయయంటే ఆశ్చర్యపోతాం.

Longest Alligator Kill : అమెరికాలో అతి పొడవైన ఎలిగేటర్‌ను చంపిన మిస్సిస్సిప్పి వేటగాళ్ళు

ఆ వింత వ్యాధి పేరు ‘డాన్సింగ్ ప్లేగు’. 15వ శతాబ్దంలో వ్యాపించిన ఈ వింత వ్యాధి సోకి 400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో..?దీనికి చికిత్స ఏమిటో కూడా తెలియదు. ఫ్రాన్స్‌లో స్ట్రాస్ బర్గ్ అనే నగరంలో 1518లో జూలైలో ఈ వింత వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధి సోకినవారికి నియంత్రణ ఉండదు. డాన్స్ చేస్తునే ఉంటారు. శరీరంలో శక్తి మొత్తం హరించుకుపోయినా డాన్స్ చేయటం మాత్రం మానరట. అలా శక్తి హరించుకుపోయి చివరకు శోష వచ్చి పడిపోతారు.

అలా ఫ్రాన్స్ లోని స్ట్రాస్ బర్గ్ నగరంలో 1518 ప్రబలింది. ఈ వింత వ్యాధికి 400మంది బలైపోయారు. 1518 జులైలోఈ వ్యాధి ఓ మహిళకు వచ్చింది. అదేమిటో అప్పుడు ఎవ్వరికి తెలియదు. నిజం చెప్పాలంటే ఈనాటికి ఆ వ్యాధి ఓ మిస్టరీ వ్యాధిగానే ఉండిపోయింది. ఆ వ్యాధి సోకిన ఆ మహిళ పేరు ట్రఫీ. ఒంటరిగా రోడ్డుపై డాన్స్ చేస్తు కనిపించటంతో ఆమెను చూసినవారంతా నవ్వుకున్నారట. అలా డాన్స్ చేసి చేసి అలసిపోయి కుప్పకూలిపోయింది. ఆమె ఎందుకలా చేస్తుందో ఎవరికి అర్థం కాలేదు.

అలా ఒక వారం రోజులు తర్వాత మరికొంతమంది పరిస్థితి అదే. మరో ముగ్గురు వ్యక్తులు డాన్స్ చేయడం మొదలుపెట్టారు. వారు కూడా అంతే ఎంతకూ డాన్స్ చేయడం ఆపలేదు. అలా రోజులు గడుస్తున్న కొద్ది ఆ నగరంలోని నాలుగు వందల మంది పరిస్థితి అలాగే మారింది. వారంతా కూడా పూనకం వచ్చినట్టుగా కరాళ నృత్యం చేయడం మొదలుపెట్టారు. అది వారికి ఇష్టం లేకుండానే జరుగుతోందని చూసేవారికి అర్థం అయింది. మొత్తానికి ఏదో జరుగుతోందనే ఆందోళన నగరమంతా వ్యాపించింది.కానీ అదేమిటో ఎందుకో అర్థం కాలేదు. అలా డాన్స్ చేసి శరీరం నీరసించిపోయి బాధితులు కింద పడిపోయేదాకా డాన్స్ చేస్తూనే ఉన్నారు. వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లినా డాక్టర్లకు అదేంటో అంతుపట్టలేదు.

Viral Video : ఓరి నాయనో.. బాత్రూమ్‌లో చితక్కొట్టేసుకున్న అమ్మాయిలు, మరీ ఇంత దారుణంగానా..!

అలా డాన్స్ చేసేవారి సంఖ్య నగరంలో పెరిగిపోవటంతో అధికారులు రంగంలోకి దిగి వారిని ఓ పెద్ద రూమ్ లో బంధించారు. అయినా వారు ఆ రూమ్ లో డాన్స్ చేస్తునే ఉన్నారు. డాన్స్ చేసి చేసి చేస్తుస్తూ మూర్చపోయారు. వారిలో 100మంది వరకు మరణించారు. ఈ పరిస్థితికి కారణం ఓ వ్యాధి అనేది నిర్ధారించకపోయినా ఏదో తీవ్రమైన ఒత్తిడి వల్లే వారు అలా ప్రవర్తిస్తున్నారని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.1518లో ఈ ఘటన జరిగినప్పటికీ ఈ వింత వ్యాధి గురించి నేటికీ క్లారిటీ రాలేదు.ఈ వ్యాధి ఎందుకొస్తుంది..? ఎలా వస్తుంది…? దీనికి నియంత్రణ ఏమిటి..? అనేదానిపై నేటికీ పరిశోధనలు జరుగుతున్నాయి.

కానీ అప్పట్లో ఆనాటి మనుషులు తినే ఆహారం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటుందనే నేటి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు వారు ‘రై పిండి’తో చేసే రొట్టెను తినేవారని..ఇది ఫంగల్ వ్యాధికి కారణమైందని దాని వల్ల మానసిక ఒత్తిడి వచ్చి అలా చేశారని వారి విపరీత ప్రవర్తనకు అదే కారణమై ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ దానికి పూర్తి కారణాలు ఏంటో మాత్రం ఈనాటికి తెలియకపోవటం ఆశ్చర్యం మిస్టరీగా ఉండిపోయింది. అలా ఇప్పటికీ డాన్సింగ్ ప్లేగు అనే వ్యాధి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

1518 జులైలో వెలుగులోకి వచ్చిన ఈ డాన్సింగ్ ప్లేగు సెప్టెంబర్ వరకు అంటే దాదాపు రెండు నెలలు కొనసాగింది.ఈ వింత వ్యాధికి 400లమంది చనిపోయారు. సెప్టెంబర్ లో ఈ వ్యాధి తీవ్రత తగ్గటం ప్రారంభమైందట. 20 శతాబ్దానికి చెందిన పరిశోధకులు మూర్ఛలకు కారణమయ్యే ఫంగల్ వ్యాధి ఎర్గోట్ తో కలుషితమైన రై పిండి తినటం వల్లే ఈ డాన్సింగ్ ప్లేగ్ వ్యాధి సోకిందని అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు