joana vasconcelos : నోరూరించే భవనం, చూస్తే తినేయాలనిపించే కేక్ భవనం

ఆ భవనాన్ని చూస్తే నోరు ఊరిపోతుంది..ఇలా కట్ చేసి అలా తినేయాలనిపిస్తుంది..

joana vasconcelos cake building : ఆ భవనాన్ని చూస్తే నోరు ఊరిపోతుంది..ఇలా కట్ చేసి అలా తినేయాలనిపిస్తుంది..అదేంటీ ఏదైనా నోనూరించే వంటకం చూస్తే తినాలనిపిస్తుంది గానీ భవనాన్ని చూస్తే తినాలని అనిపించటమేంటీ..? అనే డౌట్ వచ్చే తీరుతుంది. ఇదేదో తిరకాసులాగుందే అనుకోవచ్చు. కానీ నిజమే ఆ భవనాన్ని అంత దూరం నుంచి చూస్తే గబగబా పరుగు పెట్టుకుని వెళ్లి అమాంతం తినేయాలనిపిస్తుంది. ఎందుకంటే అది భవనం కాదు ‘కేకు లాంటి భవనం’..అచ్చంగా వెడ్డింగ్ కేకులా ఉంటుంది. క్రీము,బటర్ క్రిమ్ లతో చక్కగా అందంగా కనిపించే ‘కేకు భవనం’ అది.

చాలామంది వినూత్నంగా ఇళ్లను కట్టుకోవాలని అనుకుంటారు. పడవలాగా..షిప్పులాగా..విమానంలాగా కారు మోడల్ లా నిర్మించుకోవటం గురించి విన్నాం. కానీ ఈ భవనం మాత్రం ఫుల్ డిఫరెంట్. అచ్చంగా వెడ్డింగ్ కేకులా ఉంటుంది. చూస్తే ఇదేదో కేకులా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది వెడ్డింగ్‌ కేకు ఆకృతిలో నిర్మించిన భవనం అది. బటర్‌ క్రీమ్‌ మెట్లు, ఐసింగ్‌ టైల్స్‌ డెకరేషన్స్ తో చూడగానే కేకును గుర్తు చేసేలా ఉంటుంది. అందుకే దానిని చూడగానే తినేయాలనిపించేలా ఉంటుంది.

Blue Sun : అమెరికాలో అగ్నిప్రమాదం, యూకే నీలంగా మారిన సూర్యుడు

ఈ భవనం డెకరేషన్ సిరామిక్‌తో చేశారు. 12 మీటర్ల (39 అడుగులు) ఎత్తు ఉండే ఈ వెడ్డింగ్‌ కేకు భవనాన్ని పోర్చుగీస్‌ కళాకారిణి జోవానా వాస్కోన్సెలస్‌ రూపొందించారు. కళాత్మకమైన శిల్పాలు తయారు చేయటంతో ఈమె మంచి పేరొందారు. ఈ కళలో ఆమెకు 30 ఏళ్ల అనుభవం ఉంది. ఈక్రమంలో తన అనుభవాన్ని అంతా రంగరించి ఈ ‘కేకు భవనాన్ని’ తీర్చిదిద్దారు. ఈకేకు భవనం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 18వ శతాబ్దినాటి పోర్చుగీస్‌ సంప్రదాయమైన గార్డియన్‌ పెవిలియన్స్‌ ఆతిథ్యాన్ని నేటి తరానికి గుర్తుచేసేందుకు ఈ వెడ్డింగ్‌కేకు భవనాన్ని రూపొందించానని జోవానా తెలిపారు.

ఈకేకు భవనం మూడు అంతస్థులుగా ఉంటుంది. ఈ భవనంలోని మూడంతస్తుల్లోనూ పర్యాటకు చక్కగా తిరిగొచ్చు. ఫోటోలు తీసుకోవచ్చు. ఈ భవనం అంగుళం అంగుళాన్ని కూడా చూసేందుకు వీలుగా నిర్మాణం జరిగింది. భవనం లోపల బంగారు రంగులో చేసిన అలంకరణలు, ఐసింగ్‌లా తయారు చేసిన శిల్పాకృతులు కళ్లు తిప్పుకోనివ్వవు. అక్టోబర్‌ 26 (2023) వరకు ఈ కేకు భవంతిని వీక్షించేందుకు సందర్శకులను అనుమతించారు.

Teachers Insta Reels In School : స్కూల్లో టీచర్లు ఇన్‌స్టా రీల్స్, లైక్ చేసి షేర్ చేయకుంటే కొడతామని విద్యార్ధులకు బెదిరింపులు

ట్రెండింగ్ వార్తలు