Teachers Insta Reels In School : స్కూల్లో టీచర్లు ఇన్‌స్టా రీల్స్, లైక్ చేసి షేర్ చేయకుంటే కొడతామని విద్యార్ధులకు బెదిరింపులు

స్కూల్ టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారు. విద్యార్ధుల్ని పట్టించుకోకుండా ఇన్ స్టా రీల్స్ చేస్తుండటంతో పాఠాలు అటకెక్కాయి. పైగా రీల్స్ లైక్ చేసి షేర్ చేయాలని విద్యార్ధుల్ని టీచర్లు బెదిరిస్తున్నారు.

Teachers Insta Reels In School : స్కూల్లో టీచర్లు ఇన్‌స్టా రీల్స్, లైక్ చేసి షేర్ చేయకుంటే కొడతామని విద్యార్ధులకు బెదిరింపులు

Teachers Insta Reels In School

UP Teachers Insta Reels In School : స్కూల్లో టీచర్లు ఏం చేస్తారు..? అంటే ఇదేం పిచ్చి ప్రశ్న పిల్లలకు పాఠాలు చెబుతారు అని ఎవరైనా చెప్పేస్తారు. కానీ యూపీలోని ఓ స్కూల్లో మాత్రం మహిళా టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పటం మానేసి ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారట. రోజు చక్కగా తయారై రావటం..ఇన్ స్టా రీల్స్ చేయటం సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఇదే పని..అంతేకాదు ఇన్ స్టా రీల్స్ చేసిన ఈ టీచర్లు తమ రీల్స్ లైక్ చేసి షేర్ చేయాలి అంటూ విద్యార్ధులపై ఒత్తిడి తెస్తున్నారట. లైక్ చేసి షేర్ చేయాలని సబ్ స్ర్కబ్ కూడా చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాని వాపోతున్నారు విద్యార్ధులు. అలా చేయకపోతే కొడతామని బెదిరిస్తున్నాని విద్యార్దులు వాపోతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో కొన్ని స్కూళ్లలో టీచర్లు చేసే పనితో పిల్లల పాఠాలు అటకెక్కాయి. చదువు చెప్పే టీచర్లను చూశాం. చదవకపోతే కొట్టే టీచర్లను చూశాం. కానీ పాఠాల మాటే ఎత్తకుండా ఇలా ఇన్ స్టా రీల్స్ చేస్తు టైమ్ అంతా దానికే కేటాయిస్తు పైగా తమతో లైక్ చేసి షేర్ చేయాలని బెదిరిస్తున్న టీచర్లను మిమ్మల్నే చూస్తున్నాం అనుకుంటున్నారు.

స్కూల్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్న టీచర్లు వాటిని లైక్ చేసి షేర్ చేయాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. స్కూల్లో టీచర్లు విద్యార్థులను గాలికి వదిలేసి రీల్స్ షూట్ చేయడంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ.. సబ్‌స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

Viral Video : వావ్ వాటే సీన్..! తప్పిపోయిన బిడ్డ కనిపించగానే తల్లి పిల్లి ఏం చేసిందో చూడండీ..?

స్కూలుకు వచ్చింది మొదలు తిరిగి స్కూల్ టైమ్ పూర్తి అయ్యేంత వరకు అదే పని. ఓ టీచర్ రీల్స్ చేస్తుంటే మరో టీచర్ షూట్ చేయటం దాన్ని తమ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయటం ఇదే వారు స్కూల్ కు వచ్చి చేసే పని. దాని కోసం చక్కగా రెడీ అయి వస్తారు. స్కూలుకు రావడం ఆలస్యం అన్నట్టు వచ్చీ రావడమే రీల్స్‌కు రెడీ అయిపోతున్నారట.  ‘రవిపూజా’ అనే ఖాతాలో రీల్స్ పోస్టు చేస్తున్న టీచర్ స్కూల్‌లోనే వాటిని షూట్ చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు.

వాటిని సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని లేదంటే కొడతామని బెదిరిస్తున్నారని చెబుతున్నారు. ఆమె కోసం వంట, టీ చేయడం వంటి వాటిని కూడా తమతో చేయిస్తున్నారని పిల్లలంతా ఆవేదన వ్యక్తం చేశారు.టీచర్లు రోజు ఇదే తీరుగా ప్రవర్తిస్తుండటంతో విద్యార్ధులంతా విసిగిపోయారు. వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు కలెక్టర్ వద్దకెళ్లి విషయం చెప్పారు.

Blue Sun : అమెరికాలో అగ్నిప్రమాదం, యూకే నీలంగా మారిన సూర్యుడు

మా పిల్లల్ని స్కూళ్లకు చదువుకోవటానికి పంపిస్తున్నాం గానీ టీచర్లు చేసే రీల్స్ లైక,షేర్,సబ్‌స్క్రైబ్ చేయటానికి కాదు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే టీచర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్కూల్‌లో నడుస్తున్న ఈ రీల్స్ వ్యవహారంపై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి గంగేశ్వర్ ఆర్తి గుప్తా దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్లో రీల్స్ రికార్డ్ చేస్తున్న టీచర్లను అంబికా గోయల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్‌ అని తెలుసుకుని ప్రశ్నించారు. దీంతో టీచర్లు అంతా అడ్డంగా అబద్దాలాడేశారు. పిల్లలు నేర్చుకుంటారని కొన్నిసార్లు మాత్రం వీడియోలు చేశామని అంతకంటే తామేమీ చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ దీనిపై దర్యాప్తు చేస్తున్నామని గంగేశ్వరి గుప్తా తెలిపారు.