karnataka : SI కి ట్రాన్స్‌ఫర్ .. ఆయన కూతురికి స్టేషన్ బాధ్యతలు

తండ్రి నుంచి కూతురికి పోలీస్ స్టేషన్ బాధ్యతలు..ఓ తరం నుంచి మరో తరానికి బాధ్యతలు అప్పగించిన అరుదైన ఘటన మండ్యాలో చోటుచేసుకుంది.

karnataka mandya Police station

karnataka : కర్ణాటకలోని మండ్యా సెంట్రల్ పోలీస్ స్టేషన్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ పీఎస్ నుంచి ఓ ఎస్సై ట్రాన్స్ ఫర్ అయ్యారు. దీంతో ఆ ఎస్సై కుమార్తెకు స్టేషన్ బాధ్యతల్ని అప్పగించారు.అదేంటీ ఎస్సై ట్రాన్స్ ఫర్ అయితే ఆయన కుమార్తెకు బాధ్యతలు అప్పగించటమేంటీ అనుకుంటున్నారా? ఎందుకంటే ఆమె కూడా ఎస్సై. పైగా ఆమె తండ్రి ట్రాన్స్ ఫర్ అయిన స్టేషన్ కు నియమితులు కావటంతో తండ్రి బాధ్యతల్ని కూమార్తె స్వీకరించారు.

Tamilnadu CM Stalin : మద్యపాన నిషేధం వైపు సీఎం స్టాలిన్ సర్కార్ అడుగులు .. షాపులు మూసివేత

మండ్య సెంట్రల్ ఠాణాకు ఎస్సైగా పనిచేస్తున్న వెంకటేశ్‌కు మరోప్రాంతానికి ట్రాన్స్ ఫర్ అయ్యింది. ఆయన కుమార్తె వర్ష అదే స్టేషన్ కు ఎస్సైగా నియమితులయ్యారు. దీంతో తండ్రి కూతురుకు స్వాగతం పలికాయి. ఆ తరవాత స్టేషన్ బాధ్యతల్ని కూతురుకి అప్పగించారు. అలా తండ్రి వెళ్లటం..కూతురు రాకతో ఆ స్టేషన్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.తండ్రి బాధ్యతల్ని కుమార్తె స్వీకరించారు. దీంట్లో భాగంగా తండ్రి నుంచి వర్ష రాజదండాన్ని, పుష్పగుచ్ఛాన్ని స్వీకరించారు. దీంతో ఒక తరం నుంచి మరో తరానికి బాధ్యతలు తరలించబడిన ఆ ఘటన ఆస్టేషన్ లో అరుదైన ఘటనగా మారింది. కాగా వర్ష 2022లో సీఎస్సై పరీక్షలో అర్హత సాధించారు. ఎస్సైగా నియమితులయ్యారు.

వెంకటేశ్ సైన్యంలో 16 ఏళ్ల పాటు సేవలు అందించి..2010లో ఎస్సై పరీక్షలు రాసి అర్హత సాధించి గత 13 ఏళ్లల్లో వివిధ పీఎస్ లలో సేవలందించారు. ఈక్రమంలో ఆయన కుమార్తె వర్షం కూడా తండ్రిలా పోలీసు అవ్వాలనుకుంది. 2022లో పరీక్షలు రాసి ఎస్సైగా ఎంపికయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని తండ్రి పనిచేసే మండ్య స్టేషన్ కే ఎస్సైగా రావటం జరిగింది. ఆమె బుధవారం (జూన్ 21,2023) బాధ్యతలు చేపట్టారు. అప్పటికే ఆమె తండ్రి వెంకటేశ్ కు మరో ప్రాంతానికి బదిలీ కావటంతో అదే స్టేషన్ కు కూతురు ఎస్సైగా రావటం జరిగింది. ఇది అరుదైన ఘటనగా మారింది. కూతురిని చూసి గర్వంగా ఫీలయ్యానని వెంకటేశ్ చెప్పారు. తండ్రి నుంచి ఈ బాధ్యతలు తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని వర్ష అన్నారు. తండ్రిలా డ్యూటీలో మంచి పేరు తెచ్చుకుంటానని తెలిపారు.

Crow Temple Ringing Bell : గుడికి వచ్చి గుడి గంట మోగిస్తున్న కాకి .. అదీ పూజలు జరగని రోజుల్లోనే..!!

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు