Tamilnadu CM Stalin : మద్యపాన నిషేధం వైపు సీఎం స్టాలిన్ సర్కార్ అడుగులు .. షాపులు మూసివేత

తమిళనాడులోని సీఎం స్టాలిన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో మద్యం షాపులను మూసివేస్తోంది.

Tamilnadu CM Stalin : మద్యపాన నిషేధం వైపు సీఎం స్టాలిన్ సర్కార్ అడుగులు .. షాపులు మూసివేత

TamilNadu Govt Liquor Ban

TamilNadu Liquor Ban : తమిళనాడు (TamilNadu )లోని సీఎం స్టాలిన్ ప్రభుత్వం (CM Stalin Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మద్యపానం నిషేధం (Liquor Ban) దిశగా అడుగులేస్తోంది. దీంట్లో భాగంగా విడతలవారీగా మద్యం షాపులనూ (Liquor shops) మూసివేస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే 500ల మద్యం షాపులను మూసివేసింది. తమిళనాడు ఎన్నికల సమయంలో స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే పార్టీ (DMK Party) మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం స్టాలిన్ సర్కార్ (CM Stalin Govt) మద్యపానం నిషేధానికి పూనుకుంటోంది. అధికారంలోకి వచ్చాక స్టాలిన్ ప్రభుత్వం మద్యం విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈక్రమంలో విడతల వారీగా మద్యం షాపులను మూసివేస్తోంది.

Delhi : హైవేపై బైక్ మీద వెళ్తూ ఓ జంట కౌగిలింతలు, ముద్దులు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

రాష్ట్రం ఏదైనా ఆ రాష్ట్రానికైనా ఎక్కువగా ఆదాయం తెచ్చిపెట్టేది మద్యమే. అటువంటి మద్యాన్ని నిషేధిస్తామని పలు పార్టీలు ఎన్నికల్లో ప్రధాన ఎజెండగా ప్రకటిస్తాయి. కానీ కొన్ని పార్టీలు అమలు చేస్తాయి..మరికొన్ని అమలు చేస్తామని మోసం చేస్తునే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే షాపులను నిర్వహిస్తుంటాయి. మ‌ద్య‌పాన నిషేధం విధిస్తామ‌ని చెప్పి..హామీ ఇచ్చి ఆ తరువాత త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో విధిలేక ఆదాయం కోసం హామీలను పక్కన పెట్టేస్తుంటాయి. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలు సొంతంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నిర్వహిస్తున్నాయి.

అలాగే తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu Govt) కూడా నిర్వహిస్తోంది. ఈక్రమంలో తాజాగా స్టాలిన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని విడతల వారీగా అమలు చేయాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగానే ప్ర‌భుత్వం(State Govt) నిర్వ‌హిస్తున్న 500 మ‌ద్యం దుకాణాల‌ను గురువారం (జూన్ 22,2023)మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.దీనికి సంబంధించిన ఓ జీవోను కూడా తీసుకొచ్చింది.

Crow Temple Ringing Bell : గుడికి వచ్చి గుడి గంట మోగిస్తున్న కాకి .. అదీ పూజలు జరగని రోజుల్లోనే..!!

కాగా మొదటగా బడులు (Schools),గుడులు (temples)ఉన్న ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపుల (Liquor shops) ను మూసివేసింది. ఆ త‌రువాత క్ర‌మంగా రాష్ట్రంలోని అన్ని మ‌ద్యం షాపుల‌ను మూసివేయనుంది. మరి సీఎం స్టాలిన్ ప్రభుత్వం (CM Stalin Govt) తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఎంతవరకు అమలు జరుగుతుందో చూడాలి. ద‌శ‌ల‌వారీగా సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేధాన్ని అమ‌లు చేస్తామ‌ని చెబుతున్నా ఎంత‌వ‌ర‌కు సాధ్య‌ప‌డుతుందో చూడాలి…